Ravi Kishan: కూతురికి తల్లి లేని లోటు తెలియకూడదని.. మీసం తీసి, చీర కట్టేందుకు రెడీ అయిన స్టార్ విలన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravi Kishan: అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా సరికొత్తగా ప్రారంభమైన రియాలిటీ షో ‘అలయన్స్’ (Alliance). ఈ షో లో మొదటి వారంలోనే అత్యంత భావోద్వేగ భరితమైన దృశ్యం ఒకటి చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, గోరఖ్‌పూర్ ఎంపీ రవి కిషన్ తన కుమార్తె రీవా కిషన్‌తో కలిసి ఈ క్రేజీ షోలో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా తండ్రీకూతుళ్ల మధ్య సాగిన ఒక ఎమోషనల్ అండ్ ఫన్నీ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షోలో భాగంగా పాల్గొన్న తన కుమార్తె రీవా కిషన్ కళ్లల్లో నీళ్లు తిరగడం చూసి రవి కిషన్ ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.
ఏమైందని అడగ్గా.. “నువ్వు నన్ను బలవంతంగా ఇక్కడికి తీసుకువచ్చావు పాపా.. అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తెచ్చావు?” అంటూ రీవా కాస్త ఎమోషనల్ అయింది. ఆ వెంటనే తన కన్నీళ్లను దాచుకుంటూ.. “బహుశా మొదటి రోజు కావడం వల్ల ఇంటి జ్ఞాపకాలు గుర్తొచ్చి ఇలా ఏడ్చేసి ఉంటాను” అని సర్దిచెప్పుకుంది. కుమార్తె మాటలకు రవి కిషన్ అమాయకంగా స్పందిస్తూ.. “అయితే ఇక్కడ నేనున్నానుగా.. నేనేంటి మరి?” అని ప్రశ్నించడంతో ఒక్కసారిగా అక్కడ నవ్వులు విరిశాయి. ఆ తర్వాత రవి కిషన్ అక్కడ ఉన్న తోటి కంటెస్టెంట్లతో మాట్లాడుతూ.. రీవా ఎప్పుడూ వాళ్ల అమ్మతోనే ఎక్కువ సమయం గడుపుతుందని, అందుకే ఆమెను మిస్ అవుతుందని చెప్పారు. ఆపై అక్కడి వాతావరణాన్ని తేలికపర్చడానికి ఆయన చేసిన వ్యాఖ్యలు హైలైట్‌గా నిలిచాయి. “ఇప్పుడు నేను సడన్‌గా అమ్మగా ఎలా మారిపోవాలి? ఎవరి దగ్గరైనా విగ్ ఉందా? ఉంటే చెప్పండి.. మీసం తీసేసి, చీర కట్టేసుకుంటాను” అంటూ రవి కిషన్ జోక్ చేశారు. ఆయన టైమింగ్‌కు రీవా తన కన్నీళ్లు తూడ్చుకుని గట్టిగా నవ్వేసింది. యాక్టర్-డైరెక్టర్ కునాల్ ఖేము హోస్ట్ చేస్తున్న ఈ ‘అలయన్స్’ షో సరికొత్త స్ట్రాటజీ, టాస్కులతో ఓటీటీ ప్రియులను ఆకట్టుకుంటోంది. బాలీవుడ్ చిత్రం ‘సబ్ కుశాల్ మంగళ్’ ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రీవా కిషన్, తన తండ్రితో కలిసి ఈ షోలో పాల్గొనడం.. వారి మధ్య ఉన్న బాండింగ్ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది.
Also Read
- Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
- RaviTeja - VivekAthreya : రవితేజ 'తులాభారం'లో తూగబోయే నటీనటులు వీరేనట
- The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి 'ది పారడైస్' బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
- EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న 'ఎపిక్'.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
తాజావార్తలు
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!