Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్‌పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
- స్మార్ట్ కిచెన్స్‌పై ప్రభుత్వ క్లారిటీ
- 85 వేల వంట కార్మికులకు భరోసా
- బకాయిల విడుదలపై కీలక ప్రకటన
- తప్పుడు ప్రచారాలను నమ్మొద్దన్న ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dokka Seethamma Mid-Day Meal : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’, ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదిస్తున్న ‘స్మార్ట్ కిచెన్స్’ (Smart Kitchens) విధానంపై కొందరు రాజకీయ స్వార్థంతో చేస్తున్న ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ ప్రచారాలన్నీ ముమ్మాటికీ అవాస్తవాలని, కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్ర మాత్రమేనని మధ్యాహ్న భోజన పథకం విభాగం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. విద్యార్థుల శ్రేయస్సు, కార్మికుల ఉపాధి భద్రతపై ప్రభుత్వం కీలక వివరణ ఇచ్చింది.
‘స్మార్ట్ కిచెన్స్’ లక్ష్యం విద్యార్థుల ఆరోగ్యమే.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద, మధ్యతరగతి విద్యార్థులకు మరింత సమర్థవంతంగా, అత్యంత పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన, పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించాలనే ఏకైక సంకల్పంతోనే ప్రభుత్వం ‘స్మార్ట్ కిచెన్స్’ విధానాన్ని పరిశీలిస్తోందని అధికారులు తెలిపారు. ఆధునిక సాంకేతికతను జోడించి విద్యార్థుల ఆరోగ్య భద్రతను మెరుగుపరచడమే ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని, దీని వెనుక ఎలాంటి ఇతర ఉద్దేశాలు లేవని స్పష్టం చేశారు.
Also Read
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
కార్మికుల తొలగింపు లేదు.. ఉపాధికి పూర్తి భద్రత
స్మార్ట్ కిచెన్ల పేరుతో మధ్యాహ్న భోజన వంట కార్మికులను తొలగిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ప్రభుత్వం తేల్చిచెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా, ఒక్క కుక్‌ను కూడా తొలగించే ప్రసక్తే లేదని హామీ ఇచ్చింది. దశాబ్దాలుగా పాఠశాలల్లో సేవలు అందిస్తున్న దాదాపు 85,000 (85 వేల) మంది అక్కచెల్లెమ్మల సేవలను ప్రభుత్వం పూర్తిగా గౌరవిస్తుందని పేర్కొంది. వారి సంక్షేమానికి, ఉపాధి భద్రతకు ఎలాంటి భంగం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని, కార్మికుల పొట్ట గొట్టే ఆలోచన ఈ ప్రభుత్వానికి అస్సలు లేదని పునరుద్ఘాటించింది.
జీతాల బకాయిలపై స్పష్టత.. పాత బకాయిల విడుదల
మధ్యాహ్న భోజన కార్మికులకు ఇప్పటికే ఈ ఏడాది ఏప్రిల్ నెల వరకు జీతాలు/గౌరవ వేతనాలను పూర్తిగా చెల్లించడం జరిగిందని ప్రభుత్వం వివరించింది. కేవలం సాంకేతిక కారణాల వల్ల నిలిచిన మిగిలిన స్వల్ప బకాయిలను కూడా త్వరితగతిన విడుదల చేయడానికి నిధులు సమకూర్చామని, అతి త్వరలోనే ఈ నిధులు నేరుగా కార్మికుల ఖాతాల్లో జమ అవుతాయని తెలిపింది.
గత ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన దాదాపు రూ. 350 కోట్ల రూపాయల పైచిలుకు బకాయిలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం విజయవంతంగా విడుదల చేసిందని గుర్తు చేసింది. ఈ నిధులలో పాఠశాలల్లో పనిచేసే ఆయాలు, నైట్ వాచ్మెన్ల జీతాలతో పాటు, విద్యార్థులకు అందించే గుడ్లు, చిక్కీలు, శానిటరీ నాప్కిన్ల వెండర్లకు సుదీర్ఘకాలంగా ఇవ్వాల్సిన పాత బకాయిలు కూడా కలిసి ఉన్నాయని, దీనివల్ల లబ్ధిదారులందరికీ పెద్ద ఉపశమనం లభించిందని వివరించింది.
రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం వద్దు
విద్యార్థులకు మేలు చేసే సంస్కరణలను, కార్మికుల జీవనోపాధిని దెబ్బతీసే చర్యగా కొందరు చిత్రించడం శోచనీయమని ప్రభుత్వం ఆవేదన వ్యక్తం చేసింది. కేవలం రాజకీయ ఉనికి కోసం, ప్రజల్లో అభద్రతా భావాన్ని సృష్టించడానికి చేస్తున్న ఇలాంటి నిరాధార ఆరోపణలను ఎవరూ నమ్మవద్దని పిలుపునిచ్చింది. విద్యార్థులకు సురక్షితమైన పోషకాహారం అందించడంతో పాటు, అటు మధ్యాహ్న భోజన కార్మికుల సంక్షేమాన్ని, వారి హక్కులను కాపాడటానికి ప్రభుత్వం సమాన ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేస్తూ.. కార్మికులు ఎలాంటి ఆందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చింది.
తాజావార్తలు
-
Usha Vance: శిశువుతో హెలికాప్టర్ దిగుతుండగా కింద పడబోయిన ఉషా వాన్స్.. పట్టించుకోని సిబ్బంది
-
Indraja: నటి ఇంద్రజను చూసి ఏడ్చేసిన టాలీవుడ్ నిర్మాత
-
Rahul Gandhi: ‘‘ఎవరూ తప్పించుకోలేరు’’.. మోదీ, షా, భగవత్, జ్ఞానేష్ కుమార్‌పై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
-
Harish Rao: రాష్ట్రంలో ఒకవైపు కరెంట్ కోతలు.. మరోవైపు కరెంటు బిల్లులతో వాతలు..
-
Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్‌కు బిగ్ షాక్.. సగం ధరకే విక్రయం!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!