మంత్రి మల్లారెడ్డి పై సోదాల కేసులో ఐటీశాఖ విచారణ ముమ్మరం కొనసాగతుంది. రెండో రోజు ఆదాయపన్ను శాఖ అధికారులు చేపట్టిన విచారణ ముగిసింది. మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఇవాళ మరోసారి విచారణకు హాజరుకానున్నారు. ఇప్పటికే ఐటీ అధికారులు ఇద్దరికీ నమూనా ప్రతాలు ఇచ్చారు. నిర్దేశించిన సమాచారాన్ని సమర్పించాలని ఆదాయపు పన్నుశాఖ అధికారులు సూచించారు.