HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HYDRAA: హైదరాబాద్ మహానగరంలో వర్షాలు పడితే చాలు రోడ్లు జలమయం కావడానికి, వరద నీరు నిలిచిపోవడానికి గల అసలు కారణాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నగరంలోని వరద, మురుగు కాలువల్లో లారీల కొద్దీ చెత్త పేరుకుపోవడంతో నీటి ప్రవాహానికి తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన హైడ్రా (HYDRAA) నగరవ్యాప్తంగా నాలాల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. నాలాలు, బాక్స్ డ్రైన్ల నుంచి కేవలం సాధారణ మురికినే కాకుండా.. ఏకంగా పరుపులు, సోఫాలు, కుర్చీలు, టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలు, కేబుల్ వైర్లను తొలగిస్తూ హైడ్రా సిబ్బంది శ్రమిస్తున్నారు.
ఈ భారీ ప్రక్షాళన కార్యక్రమం కోసం జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ, ఇరిగేషన్, పోలీస్ శాఖల సహకారంతో హైడ్రా ముమ్మర చర్యలు చేపట్టింది. నగర ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు హైడ్రా డిఆర్ఎఫ్ (DRF), మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు 24 X 7 అందుబాటులో ఉంటూ నిరంతరాయంగా చెత్తను తొలగిస్తున్నాయి. ముఖ్యంగా ఆఘాపురా నాలా వద్ద గత ఆరు రోజులుగా పూడికతీత పనులు నాన్‌స్టాప్‌గా కొనసాగుతున్నాయి. ఈ ఒక్క నాలా నుంచే ఇప్పటివరకు ఏకంగా 13 టిప్పర్ల చెత్తను హైడ్రా సిబ్బంది వెలికితీయడం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మరోవైపు మియాపూర్ – పటాన్చెరు ప్రధాన మార్గంలోని బాక్స్ డ్రైన్లో భారీగా పేరుకుపోయిన కేబుల్ వైర్ల వ్యర్థాలు బయటపడ్డాయి. అలాగే చందానగర్, లింగంపల్లి ఆర్యూబీ (RUB) వద్ద ఉన్న బాక్స్ డ్రైన్ నుంచి రెండు ట్రక్కుల నిండా కేవలం ప్లాస్టిక్ వ్యర్థాలనే అధికారులు తొలగించారు. కృష్ణానగర్ బాక్స్ డ్రైన్లో అయితే ఏకంగా 7 అడుగుల మేర పూడిక పేరుకుపోగా, జీహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి హైడ్రా బృందాలు దాన్ని పూర్తిగా క్లియర్ చేశాయి. ఈ మురుగు కాలువలు, నాలాలు అనేవి కేవలం వరద నీరు సజావుగా సాగిపోవడానికేనని.. కాబట్టి ప్రజలందరూ బాధ్యతగా వ్యవహరించి కాలువల్లో ఇలాంటి చెత్తాచెదారం వేయవద్దని, నగరాన్ని కాపాడుకోవడంలో సహకరించాలని హైడ్రా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసింది.
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
- Tags
- box drains
- GHMC
- hyderabad
- HYDRAA
- Monsoon
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?