తెలంగాణలో గత కొంతకాలంగా కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి… కానీ ఈరోజు పెరిగాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 173 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కగా.. ఒక్క కరోనా బాధితుడు మృతి చెందారు.. ఇక, ఇదే సమయంలో 168 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,72,823 కు చేరగా… రికవరీ కేసులు 6,65,101 కు పెరిగాయి.. ఇప్పటి వరకు కరోనా బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 3,968 కు పెరగగా.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 3,754 యాక్టివ్ కేసులు ఉన్నాయి.. ఒకే రోజు 40,797 శాంపిల్స్ పరీక్షించినట్టు బులెటిన్‌లో పేర్కొన్నారు.