తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 36,999 శాంపిల్స్ పరీక్షించగా… 164 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. మరో ఒక్క కరోనా బాధితుడు ప్రాణాలు వదిలారు.. ఇదే సమయంలో.. 186 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,72,367కు చేరగా.. కోలుకున్నవారి సంఖ్య 6,64,588కు పెరిగింది. ఇక, ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి మృతిచెందిన వారి సంక్య 3,964కు చేరినట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. తాజా కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 51 నమోదు కాగా.. మేడ్చల్ మల్కాజ్‌గిరిలో, 14 చొప్పున కేసులు వెలుగు చూశాయి.