రాష్ట్రంలో పలు చోట్ల ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు ప్రయాణికులు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇవాళ సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును లారీ ఢీ కొట్టిన సంఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. చిన్నకోడూరు మండలం మల్లారం స్టేజీ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రాంగ్ రూట్‌లో వచ్చిన లారీ కారును ఢీకొట్టినట్లుగా తెలుస్తుంది. ప్రమాదం జరిగిన సమయంలో లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. కారులో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా.. అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అయితే, మృతులకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ నెల 9వ తేదీన యాదాద్రి జిల్లా వలిగొండ మండలం టేకులసోమారం గ్రామానికి చెందిన దండెబోయిన నర్సింహ, రాజ్యలక్ష్మి భార్యాభర్తలు. బొమ్మలరామారం మండలం చౌదరిపల్లిలో వీరి బంధువు చనిపోవడంతో భార్యతో పాటు వదిన జంగమ్మను తీసుకుని నర్సింహ బైక్ పై బయలుదేరాడు. భువనగిరి పట్టణ సమీపంలోని హనుమపూర్ బచ్పన్ స్కూల్ వద్ద వీరు ప్రయాణిస్తున్న బైక్ ను అతివేగంతో వచ్చిన డిసిఎం ఢీకొట్టింది. దీంతో బైక్ నడుపుతున్న నర్సింహతో పాటు వెనకాల కూర్చున్న ఇద్దరు మహిళలు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి రోడ్డుపై రక్తపుమడుగులో పడిపోయారు. తీవ్ర గాయాలతో ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
జనగామ జిల్లాలో ఈ నెల 5న రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి దర్గా సమీపంలో ఓ టవేరా వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టవేరాలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు, అటుగా వెళ్తున్నవారు.. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
Maganti Gopinath: అధికారులు ఫోన్ ఎత్తరు.. పనిచేయరు.. ఎమ్మెల్యేకు ఫిర్యాదు