Kondagattu Temple: కొండగట్టు ఆలయంలో చోరీ.. బంగారు నగలతో పాటు విగ్రహాలు మాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kondagattu Temple: భయాలు తొలగించే అభయ ఆంజనేయుడి ఆలయంలోనే ఏకంగా చోరీకి పాల్పడ్డారు దొంగలు. జగిత్యాలలో ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు లోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో అర్ధరాత్రి దొంగతనం జరిగింది. నిత్యం భక్తులతో ఉండే అంజన్న ఆలయంలో దొంగతనం జరిగడం తీవ్ర కలకలం రేపింది. ప్రసిద్ద పుణ్య క్షేత్రమైన కొండగట్టులో దోపిడీ దొంగలు చెలరేగిపోయారు. అర్థరాత్రి ఆలయంలోకి చొరబడి భీభత్సం సృష్టించారు. రాత్రి స్వామి వారి పవళింపు సేవ అనంతరం గుడి ప్రధాన ద్వారాలకు తాళాలు వేసి వెల్లిపోయారు. శుక్రవారం వేకువ జామున ఆలయాన్ని తెరిచి సుప్రభాత సేవ చేసేందుకు గుడికి వెల్లిన అర్చకులు ప్రధాన ద్వారం నుండి లోపలకు అగంతకులు చొరబడినట్టుగా గమనించారు. వెంటనే పోలీసులుకు సమాచారం ఇవ్వడంతో ఆరా తీయడం ఆరంభించారు. ప్రధాన ఆలయంలో బంగారు నగలతో పాటు కొన్ని విగ్రహాలు, అనుభంద ఆలయాల్లోని విగ్రహాలను చోరీకి గురైనట్టు ప్రాథమికంగా నిర్దారించారు. అయితే పోలీసులు పూర్తిగా ఆరా తీసే పనిలో నిమగ్నం కావడంతో పూర్తి వివరాలు తెలియరావడం లేదు. అయితే కొండగట్టు అంజన్న క్షేత్రంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిని సీసీ కెమెరాల్లోని ఫుటేజీ ఆధారంగా అనుమానితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నం అయ్యారు. మరో వైపున క్లూస్ టీంతో పాటు డాగ్ స్క్వాడ్ లను రంగంలోకి దిగారు.
Read also:Cyber Thieves: టెలిగ్రామ్ యాప్, డేటాఫ్ బర్త్ పేరిట మోసం.. కోట్లు కొట్టేస్తున్న సైబర్ కేటుగాళ్లు
Also Read
- Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
- Telangana Congress New In-Charge: తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త ఇంచార్జ్.?
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
13 మంది అధికారులు పహారాకాస్తున్నా చోరీ ఎలా?
ఇది ఇలా ఉంటే కొండగట్టు ఆలయం వద్ద ఒక ASI, నలుగురు హోమ్ గాడ్స్, ఎనిమిది మంది సెక్యూరిటీ గాడ్స్ ఉండగా చోరీ జరిగడం చర్చకు దారితీస్తోంది. కొండగట్టు దేవస్థానం లో స్వామి వారి మాకటాతోరణం, శటరి ఎత్తుకెళ్లారు దొంగలు. ఆలయంలో చోరీ జరుగుతున్న సమయంలో వీల్లందురు ఎక్కడ వున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆంజనేయ ఆలయంలోనే చోరీకి పాల్పడుతున్నా అధికారులు ఎక్కడికి వెళ్లి వుంటారని స్థానికులు ముక్కుమీద వేలువేసుకుంటున్నారు. అంతగొప్ప ఆలయంలోనే అంత మంది అధికారులు పడిగాపులు కాస్తున్న చోరీ చేశారంటే ఇది అధికారుల నిర్లక్ష్యం కారణంగానే దొంగలు చోరీకి పాల్పడ్డారని స్థానిక ప్రజలు అంటున్నారు. ఆలయం మూసివేసి చోరీకి పాల్పడిన దొంగలను వెతకండ ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఆలయానికి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందిగా మారిందని వాపోతున్నారు. ఆలయ ద్వారాలు తెరచి శుద్ది చేసి, శ్రీ ఆంజనేయ స్వామి వారికి యధాప్రకారం పూజలు కొనసాగించాలని కోరుతున్నారు. ఆలయంలోనే చోరీకి పాల్పడిన దొంగలను త్వరగా పట్టుకుని కఠిన శిక్ష వేయాలని కోరుతున్నారు.
Medico Preethi: ప్రీతి ఫోన్ చాటింగ్ తో పాటు కొన్ని కీలక ఆధారాలు.. కస్టడిలో సైఫ్
కొండగట్టుతో పాటు ధర్మపురి మండలం రాయపట్నం లోని శివాలయంలో హుండీ పగలగొట్టి ఎత్తుకెళ్లారు దుండగులు. జగిత్యాల రూరల్ మండలంలోని పొలాస గ్రామంలో గల పౌలస్తీశ్వర స్వామి ఆలయ కార్యాలయంలోని బీరువాను దొంగలు పగలగొట్టి సొత్తను దోచుకెళ్లారు. మల్యాల సిఐ రమణమూర్తి ఆధ్వర్యంలో కొండగట్టు చోరీ విషయంలో 10 బృందాలచే గాలింపు చర్యలు చేపట్టారు. రంగంలోకి దిగిన ఇప్పటికే క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్.. వివరాల సేకరించే పనిలో పడ్డారు. వీలైనంత త్వరగా దొంగల్ని పట్టుకుంటామని జగిత్యాల డిఎస్పి ఆర్ ప్రకాష్ వెల్లడించారు. రెండు చోట్లు చోరీ జరగడంతో జిల్లా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే దొంగలను పట్టుకోవాలని సూచించారు.
Ram Gopal Varma: కేటీఆర్ సార్.. మేయర్ ఇంట్లోకి వీధికుక్కలను వదలండి.. ఆర్జీవీ వీడియో వైరల్..
తాజావార్తలు
-
Bethlehem Kudumba Unit : ఓవర్సీస్లో వాయించి కొట్టిన ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
Disha Salian Death Case: ‘నేను ఇకపై మౌనంగా ఉండను’… దిశా సాలియన్ కేసుపై మౌనం వీడిన సూరజ్ పంచోలి
-
Asia Cup Trophy Row: నఖ్వీతో ప్రొఫెషనల్ ఇంటరాక్షన్ మాత్రమే.. సైకియాపై విమర్శలు వద్దు: బీసీసీఐ
-
Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!