Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
- హైదరాబాద్ బేగం బజార్లో ప్రత్యేక గణపతి విగ్రహం..
- 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్‌తో గణపయ్య..
- 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత అలంకరణ..
- లిచీ పెరల్ సెట్ జ్యువెలర్స్‌లో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Gold Ganesh Idol: వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్ బేగం బజార్‌లోని ‘లిచీ పెరల్ సెట్ జ్యువెలర్స్’లో ప్రత్యేకంగా రూపొందించిన గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ గణపతిని 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్‌తో పాటు ఏకంగా 3,83,800 అమెరికన్ డైమండ్లతో ఈ విగ్రహాన్ని అలంకరించారు.
లిచీ పెరల్ సెట్ జ్యువెలర్స్‌లో వినాయకుడిని ప్రతిష్ఠించడం ఇది మూడో ఏడాది. ఈసారి ఏదైనా ప్రత్యేకంగా చేయాలనే ఆలోచనతో ఈ అద్భుతమైన గణపతి విగ్రహాన్ని రూపొందించినట్లు సంస్థ నిర్వాహకుడు అధర్ అగర్వాల్ తెలిపారు. గణేశుడి ఆశీస్సులతోనే ఇంత అందమైన విగ్రహాన్ని తయారు చేయగలిగామని ఆయన అంటున్నారు.
Also Read
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
ఈ విగ్రహాన్ని ఇత్తడితో పాటు మొత్తం ఐదు రకాల లోహాలను ఉపయోగించి రూపొందించారు. వెనుక భాగంలోని మకరతోరణంలో దశావతారాల రూపాలను ప్రత్యేకంగా పొందుపరిచారు. మకరతోరణం పైభాగంలో శ్రీ వేంకటేశ్వర స్వామి రూపాన్ని, ఇరువైపులా లక్ష్మీదేవి, సరస్వతీదేవి ప్రతిమలను అందంగా తీర్చిదిద్దారు. దీనితో ఆ విగ్రహం చూడడానికి రెండు కళ్లు సరిపోవంటే నమ్మండి.
ఈ గణపతి విగ్రహానికి ప్రధాన ఆకర్షణ ముఖ్య కారణం.. ఇందులో ఏకంగా 3,83,800 అమెరికన్ డైమండ్లు పొందుపరిచారు. సాధారణంగా తమ ఫ్యాషన్ జ్యువెలరీ తయారీలో ఉపయోగించే ముడి పదార్థాలనే ఈ విగ్రహంలోనూ వినియోగించినట్లు నిర్వాహకులు తెలిపారు. దీంతో గణపతికి ప్రత్యేకమైన జ్యువెలరీ లుక్ వచ్చింది. విగ్రహాన్ని తయారు చేయడం వెనుక ఎంతోమంది కళాకారుల శ్రమ ఉంది. కార్డ్ డిజైనర్లు, కాస్టింగ్ నిపుణులు, స్టోన్ సెట్టర్లు, పాలిషింగ్ వర్కర్లతో కూడిన ప్రత్యేక బృందం సుమారు 8 నెలల పాటు రాత్రింబవళ్లు పనిచేసింది. ఒక్కో డైమండ్‌ను చేతితో అమర్చుతూ విగ్రహాన్ని అత్యంత జాగ్రత్తగా తీర్చిదిద్దినట్లు అగర్వాల్ తెలిపారు.
ఈ విగ్రహం బేస్ డిజైన్‌ను ముంబైలోని ప్రసిద్ధ లాల్బాగ్ కా రాజా రూపురేఖల స్ఫూర్తితో రూపొందించారు. హైదరాబాద్ పాతబస్తీలో పుట్టి పెరిగిన తమకు చిన్నతనం నుంచే గణేష్ ఉత్సవాలతో ప్రత్యేక అనుబంధం ఉందని అగర్వాల్ చెప్పుకొచ్చారు. పాతబస్తీలో గణేష్ ఉత్సవాలకు ప్రత్యేక స్థానం ఉందని, చిన్నతనం నుంచే గణపతి కోసం ఏదైనా ప్రత్యేకంగా చేయాలనే కోరిక ఉండేదని ఆయన చెప్పారు. ఈసారి ఆ అవకాశం లభించడంతో ఇంత ప్రత్యేకమైన విగ్రహాన్ని తయారు చేసినట్లు వెల్లడించారు. 24 క్యారెట్ల బంగారు మెరుపు, లక్షలాది అమెరికన్ డైమండ్ల అలంకరణతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ జ్యువెలరీ గణపయ్యను దర్శించుకునేందుకు స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!