Kondagattu Temple : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న సన్నిధిలో ఆధ్యాత్మిక వాతావరణానికి బదులు ఇప్పుడు భూవివాద సెగలు కనిపిస్తున్నాయి. ఆలయ అభివృద్ధి పనుల విషయంలో దేవాదాయ శాఖ , అటవీ శాఖల మధ్య తలెత్తిన విభేదాలు ఇప్పుడు రచ్చకెక్కాయి. ఈ రెండు శాఖలకు ఒకరే మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ, అధికారులు మాత్రం ఒకరిపై ఒకరు నోటీసులు ఇచ్చుకోవడం ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ వివాదానికి ప్రధాన కారణం ఆలయ పరిధిలో ఉన్న సుమారు ఆరు ఎకరాల…
భయాలు తొలగించే అభయ ఆంజనేయుడి ఆలయంలోనే ఏకంగా చోరీకి పాల్పడ్డారు దొంగలు. జగిత్యాలలో ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు లోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో అర్ధరాత్రి దొంగతనం జరిగింది.
మళ్ళీ వస్తా.. ఆలయ అభివృద్ధి, విస్తరణ పై సమీక్ష నిర్వహిస్తానని సీఎం కేసీఆర్ అన్నారు. జగిత్యాల జిల్లా కొండగట్టులో ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి పై అధికారులతో రెండు గంటలకు పైగా సీఎం సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు.
జగిత్యాల జిల్లా మాల్యాల మండలంలోని కొండగట్టులో సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఆయన గతంలో కుటుంబ సభ్యులతో కలిసి కొండగట్టు వెళ్లిన పాత ఫోటోలు బుధవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Pawan Kalyan varahi : జనసేన పార్టీ ప్రచార రథం వారాహి వాహనం రేపు జగిత్యాల జిల్లా కొండగట్టుకు చేరుకోనుంది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆంజనేయస్వామి ఆలయంలో అక్కడ శాస్త్రోక్తంగా పూజలు జరిపించనున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ వారాహికి పూజలు నిర్వహించి పవన్ ప్రచార రథాన్ని ప్రారంభిస్తారు.