Atrocious: ఆస్తికోసం తల్లి అంతక్రియలు ఆపేసిన కొడుకు.. మూడు రోజులుగా ఫ్రీజర్ లోనే డెడ్ బాడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Atrocious: మానవ సంబంధాలు రానురాను మరింత పలుచబారుతున్నాయి. ఆస్తి కోసమే బందాలను గుర్తు చేసుకుంటున్న రోజులు వచ్చాయి. కల్లముందే తల్లి చనిపోయిందనే బాధ కంటే.. ఆస్తి పంచకుండా వెళ్లిపోయిందనే బాధపడే పిల్లలు ప్రస్తుత సమాజంలో ఎక్కువైపోతున్నారు. కని పెంచిన తల్లి రేపటి నుంచి మన కళ్ల ముందు ఉండదనే విషయాన్ని చాలా తేలిగ్గా జీర్ణించుకుంటున్నారు. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి ఎక్కడ తమకు దక్కకుండా పోతుందనే ఆవేదనతో మూడు రోజులుగా తల్లి అంత్యక్రియలు చేయకుండా మృతదేహాన్ని ఇంటి ముందే ఉంచుకుని పిల్లలు పంచాయితీకి ఎక్కిన వింత ఘటన సూర్యపేటలో చోటుచేసుకుంది.
Read also: Telangana Rains: వాతావరణ శాఖ అలర్ట్.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..
Also Read
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
ఏం జరిగింది..?
సూర్యపేట జిల్లా నేరేడుచర్ల మండలం కందులవారి గూడెం లక్ష్మమ్మ అనే మహిళ నివాసం ఉంటుంది. లక్ష్మమ్మకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. ఓ కుమారుడు చాలా కాలం క్రితమే మృతి చెందగా.. కూతుళ్ళ వద్దే ఉంటుంది లక్ష్మమ్మ. వీరి కోసం బాగానే ఆస్తులు సంపాదించింది. అయితే ఈ ఆస్తులే ఆమె అంత్యక్రియలకు అడ్డుగా మారాయి. కొద్దిరోజుల క్రితం తన కూతురు ఇంటికి వెళ్లిన లక్ష్మమ్మ ప్రమాదవశాత్తు జారీ పడింది. దీంతో లక్ష్మమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. లక్ష్మమ్మను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మూడు రోజుల క్రితమే మృతి చెందింది. అయితే అనారోగ్యంతో చికిత్స పొందుతూ లక్ష్మమ్మ మృతి చెందడంతో కొడుకు, కూతుళ్లు ఆస్తి పంపకాలు పూర్తయ్య వరకు అంబులెన్స్ ను తరలించేది లేదని తేల్చిచెప్పారు దీంతో లక్ష్మమ్మ వద్ద ఉన్న 21 లక్షల రూపాయల్లో ఆరు లక్షలు వైద్య ఖర్చులకు ఖర్చు చేయగా మిగిలిన 15 లక్షల రూపాయలను కొడుకు తీసుకున్నట్లు తెలుస్తోంది. మృతురాలి వద్ద ఉన్న 20 తులాల బంగారాన్ని ముగ్గురు కూతుళ్లు సమానంగా పంచుకున్నారు. పంపకాలు సమానంగా.. సమస్య లేకుండా ముగిసినా.. అంత్యక్రియలు చేయాల్సిన కొడుకు చివరి క్షణంలో కొర్రీ పెట్టడంతో అంత్యక్రియలు నిలిచిపోయాయి.
Read also: Potholed Roads: రోడ్లు గుంతలు పడ్డ ఎవరు పట్టించుకోరు.. మా బాధ ఎవరికి చెప్పుకోవాలే..
అంత్యక్రియలకు అయ్యే ఖర్చును సమానంగా భరించాలని… అలా జరిగితేనే తలకొరివి పెడతామని తేల్చి చెప్పడంతో అంత్యక్రియలు నిలిచిపోయాయి. దీంతో అంతక్రియల ఖర్చు వివాదం తల్లి అంత్యక్రియలు నిలిచిపోయేలా చేసింది. అంత్యక్రియల ఖర్చు పంచాయతీ కొడుకు, కుమార్తెల మధ్య గొడవకు కారణమైంది.. దీంతో అంత్యక్రియలు ఆగిపోగా ఫ్రీజర్ లోనే లక్ష్మమ్మ మృతదేహం ఉండిపోయింది. కన్న బిడ్డల తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డెడ్ బాడీని ఇంకా అంత్యక్రియలు జరపకుండా ఇంటి వద్ద ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మమ్మ బతికున్నప్పుడు బాగానే ఉందని ఎవరితోనూ మాట పడేది కాదని, కానీ ఇప్పుడు ఆమె అంత్యక్రియలు కూతుర్లు, కొడుకు వల్లే ఆగిపోవడం బాధగా వుందని తెలిపారు. పెద్దవారు ఎవరైనా వచ్చి లక్ష్మమ్మ అంత్యక్రియలు జరిపించాలని కోరుతున్నారు.
Wife Kills Husband: ప్రియుడి మోజులో భర్తను చంపిన భార్య.. మూణ్నెళ్ల తర్వాత…
తాజావార్తలు
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!