సాహిత్య రంగంలో డాక్టర్ ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, డాక్టర్ చెన్నయ్యలు తల్లి పాత్ర పోషిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ అబిడ్స్ లోని బొగ్గులకుంటలో, తెలంగాణ సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో శాంతా వసంతా ట్రస్టు పురస్కారాల ప్రధానోత్సవంలో మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రితో పాటు శాంతా బయోటెక్స్ వ్యవస్థాపకులు పద్మభూషణ్ డాక్టర్ కే ఐ వరప్రసాద్ రెడ్డి.. పలువురు సాహితీ వేత్తలు పాల్గొన్నారు. శాంతా వసంత ట్రస్ట్ ఆధ్వర్యంలో… డాక్టర్ ఆచార్య ఎల్లూరి శివారెడ్డికి ఉత్తమ సాహితీవేత్త’ పురస్కారం, డాక్టర్ జుర్రు చెన్నయ్యకి ‘తెలుగుభాషా సేవారత్న’ పురస్కారాలను మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రధానం చేసి, ఘనంగా సన్మానించారు.
అనంతరం మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడారు. వీరిద్దరూ సాహిత్య రంగానికి చేసిన సేవ వర్ణించలేనిదని.. తమ కోసంఆలోచించకుండా.. సాహిత్య అభివృద్ధి కోసం కృషిచేస్తారని మంత్రి అన్నారు. వ్యాపారాల పరంగా ఎంతో బిజీగా ఉండే డాక్టర్ వరప్రసాద్ రెడ్డి.. సాహిత్య రంగాల వారిని అమ్మలా ఆదరిస్తారని కొనియాడారు. సాహితీ ప్రియులను కేవలం పట్టణాలకు పరిమితం చేయకుండా గ్రామీణ ప్రాంతాల వారిని వెలికితీయాలని మంత్రి సూచించారు.