Jangaon dabal bedroom: ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్ల మంజూరులో జాప్యం జరుగుతుండటంతో లబ్ధిదారుల ఓపిక నశించింది. ఇప్పుడు ఇళ్లు ఇచ్చేది లేదని తేల్చేసిన అధికారులు.. తామే రంగంలోకి దిగారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల తాళాలు పగులగొట్టి ఇళ్లలోకి ప్రవేశించారు. అధికారుల అనుమతి లేకుండా లబ్ధిదారులు ఇళ్లలోకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన జనగాం జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో చోటుచేసుకుంది.
Read also: Dharmapuri Election Issue: ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ తాళాలు మిస్సింగ్.. రంగంలోకి ఈసీ
జనగాం జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో గూడూరు గ్రామంలో ఇళ్లులేని వారికోసం ప్రభుత్వం 70 డబుల్ ఇండ్లు నిర్మించి అయితే నిర్మాణం పూర్తయి రోజులు గడుస్తున్నా లబ్దిదారులకు వాటిని కేటాయించట్లేదు. అర్హులైన లబ్ధిదారుల కు డబుల్ బెడ్ రూమ్ ప్రభుత్వం ఇప్పటివరకు పంచకపోవడంతో ఇన్నాళ్లు ఓపిక పట్టిన లబ్దిదారులు ఇక తమవల్ల కాదంటూ గృహ ప్రవేశాలు చేశారు. తాళాలు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లారు. గ్రామంలో 70 డబుల్ ఇండ్లు నిర్మించి నాలుగు సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటి వరకు ఏ అధికారులు పట్టించేకోలేదని వాపోయారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇండ్ల తాళాలు పగలగొట్టి వెళ్లారు. ప్రభుత్వం ఇల్లు నిర్మించి అర్హులైన నిరుపేదలకు పంపిణీ చేయకుండా నాలుగు సంవత్సరాలు గడిచింది అయినా పట్టించుకునే నాధుడు కరువయ్యాడని మండిపడ్డారు. ఎవరైనా వచ్చి డబుల్ బెడ్ రూంలు మాకు ఇస్తారనే ఆశలేదని, ఎవరూ పట్టించుకోకపోవడంతోనే ఇప్పటి వరకు ఎదురుచూసి నిరుత్సాహపడ్డామని అన్నారు. చివరకు తాళాలు పగల గొట్టి ఇండ్లలోకి వెళ్లడం జరిగిందని తెలిపారు.
TSPSC Paper Leak: నేడు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలను విచారించనున్న ఈడీ