ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాకతో రేపు హైదరాబాద్ నగరంలో పోలీసులు ఆంక్షలు విధించారు. రాజ్ భవన్, ఎల్బీస్టేడియం సభ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రత ఏర్పాట్లలో భాగంగా ఉన్నతాధికారుల సూచనలతో ఎన్టీఆర్ గార్డెన్, లుంబిని పార్క్ లను మూసివేయాలని (HMDA) నిర్ణయం తీసుకుంది.
దేశవ్యాప్తంగా భారీ పేలుళ్లకు కుట్ర పన్నిన నలుగురు ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులకు ఎట్టకేలకు శిక్ష పడింది. వీరికి గోకుల్ చాట్, లుంబినీ పార్క్, దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్లతో సంబంధాలు ఉన్నాయి.
Parks Closed: హైదరాబాద్‌లో గురువారం పార్కులను మూసివేయనున్నారు. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా ఈ నెల 22న తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదురుగా ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అమరవీరుల స్మారక స్థూపాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.
2007 ఆగస్టు 25.. హైదరాబాద్ మహానగరంతో పాటు దేశం మొత్తాన్ని ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసిన గోకుల్ చాట్, లుంబిని పార్క్ జంట పేలుళ్లకు ఇవాల్టితో 15 ఏళ్లు పూర్తయింది. ఈ దుర్ఘటనలో మొత్తం 44 మంది ప్రాణాలు కోల్పోగా వందలాది మంది గాయపడ్డారు. బాంబుల్లో వినియోగించిన ఇనుప ముక్కల ధాటికి వందలాది మంది శరీర అవయవాలు కోల్పోయి జీవచ్ఛవాలుగా మారారు. ఈ దారుణానికి ఇండియన్ ముజాహిద్దీన్ అనే ఉగ్రవాద సంస్థ పాల్పడింది. ప్రశాంత వాతావరణంలో అలజడి సృష్టించింది.…
హైదరాబాద్ నగరంలో మీరు పార్కులకు వెళ్తున్నారా? అయితే మీ కోసం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) శుభవార్త తెలిపింది. సంజీవయ్య, లుంబినీ పార్క్, ఎన్టీఆర్ గార్డెన్స్‌కు వెళ్లే పర్యాటకుల వద్ద కెమెరాల కోసం ఇకపై ఫీజులు వసూలు చేయబోమని HMDA వెల్లడించింది. గతంలో ఈ మూడు పార్కుల్లోకి కెమెరాతో వెళ్తే అదనంగా రూ.1000 వసూలు చేసేవారు. ఇప్పుడు కెమెరాలకు, వీడియో కెమెరాలకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదని HMDA ప్రకటించింది. ప్రజల విజ్ఞప్తుల మేరకు…
హైదరాబాద్ లో గోకుల్ చాట్, లుంబిని పార్క్ జంట పేలుళ్ల కు నేటి తో 14 ఏళ్ళు పూర్తి అయ్యాయి. 2007 ఆగస్టు 25 హైదరాబాద్ లో జంట పేలుళ్లు జరిగాయి. జంట పేలుళ్లలో మొత్తం 44 మంది మృతి చెందారు. వందలాది మంది క్షతగాత్రులు అయ్యారు. 14 ఏళ్ళు అయిన ఇంకా ఆ రక్త మరకలు మారలేదు. ఈ పేలుళ్లకు ఇండియన్ ముజాహిద్ధిన్ ఉగ్రవాద సంస్థ కుట్ర పన్నింది. ఈ కేసులో ఇద్దరు ఉగ్రవాదులకు ఉరిశిక్ష…