చేనేతను ప్రొత్సహించడానికి అంగన్‌వాడీలకు చీరలు: కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చేనేతను ప్రొత్సహించడానికి అంగన్‌వాడీ టీచర్లకు, ఆయాలకు ప్రతి ఏడాది చీరలను అందజేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం ప్రగతి భవన్‌లో చేనేత, జౌళి శాఖ మంత్రి కె.టీ. రామారావు, మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు చీరలను పంపిణీ చేశారు. ట్రాన్స్ జెండర్లు తయారు చేసిన జ్యూట్ బ్యాగులను కూడా కేటీఆర్ విడుదల చేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల వేతనాలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మూడుసార్లు సవరించి 30 శాతం పీఆర్సీని పెంచిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేతను ప్రోత్సహించడానికి, నేత కార్మికులకు మరిన్ని ఆర్డర్‌లను అందించే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని మంత్రి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 31,711 ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలు, 3989 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయన్నారు.
Read Also:నీకు వత్తాసు పలికితే కేసులు లేవు.. లేదంటే కేసులు పెట్టి బెదిరిస్తావా: బండి సంజయ్
Also Read
ఈ కేంద్రాల్లో పనిచేస్తున్న 67,411 మంది అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు చేనేత చీరలను అందజేస్తున్నామన్నారు.ఇప్పటికే స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు ఏటా రెండు చీరలను అందజేస్తోంది. ఇప్పుడు దీనికి అదనంగా చేనేత చీరలను ఆ శాఖ ద్వారా పంపిణీ చేసి నేతన్నలను ఆదుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. అనంతరం మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ మాట్లాడుతూ. .అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు చీరలతో పాటు గౌరవ వేతనం అందజేస్తున్నామని, కేంద్రాలను బలోపేతం చేయడంతోపాటు నాణ్యమైన పూర్వ ప్రాథమిక విద్యను, పౌష్టికాహారాన్ని అందజేసేందుకు నిరంతరం ప్రత్నిస్తున్నామని తెలిపారు.
తాజావార్తలు
-
Tesla: ఫ్లయింగ్ కారు కేవలం శాంపిల్ మాత్రమే.. మస్క్ నెక్ట్స్ ఈ మూడు ప్రాజెక్టుల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
-
Noida: ప్రాణం తీసిన మ్యాగీ.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
DDA Karmayogi Awas Yojana: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఫ్లాట్లపై 25 శాతం డిస్కౌంట్.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే..!
-
Sangameswara Temple: ఆరు నెలల ముందే బయటపడ్డ సంగమేశ్వరుడు.. కృష్ణా తీరంలో ముందస్తుగా కరవు ఛాయలు.!
ట్రెండింగ్
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!