చేనేతను ప్రొత్సహించడానికి అంగన్‌వాడీ టీచర్లకు, ఆయాలకు ప్రతి ఏడాది చీరలను అందజేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం ప్రగతి భవన్‌లో చేనేత, జౌళి శాఖ మంత్రి కె.టీ. రామారావు, మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు చీరలను పంపిణీ చేశారు. ట్రాన్స్ జెండర్లు తయారు చేసిన జ్యూట్ బ్యాగులను కూడా కేటీఆర్ విడుదల చేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల వేతనాలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మూడుసార్లు సవరించి 30 శాతం…