నీకు వత్తాసు పలికితే కేసులు లేవు.. లేదంటే కేసులు పెట్టి బెదిరిస్తావా: బండి సంజయ్


కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సిద్ధిపేటలోని రంగదాంపల్లి వద్ద కార్యకర్తలను కలిసి వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ పై నిప్పులు చెరిగారు. రాష్ట్రముఖ్యమంత్రి నేతృత్వంలో పోలీసులు దాడి చేసిన తీరును దేశం మొత్తం చూసిందన్నారు. నీకు వత్తాసు పలికితే కేసులు లేవు.. లేదంటే కేసులు పెట్టి బెదిరిస్తావా అంటూ ఫైర్‌ అయ్యారు. రాష్ర్టంలో రాక్షస పాలన నడుస్తుందన్నారు. నా కార్యాలయంలో దాడులు చేసి, ధ్వంసం చేశారు. నా కార్యాలయంలో ఫైల్స్‌ను అన్నింటిని నాశనం చేశారు. 317 జీవో రద్దు చేయాలి, నిన్ను ఫామ్ హౌస్‌ పడుకోవడానికి ముఖ్యమంత్రిగా ఎన్నుకోలేదని..ప్రజల సమస్యలను తీర్చడానికి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని కేసీఆర్‌పై బండి సంజయ్‌ మండిపడ్డారు.

Read Also:హెరిటేజ్‌లో రేట్ల కన్నా మార్కెట్ రేట్ తక్కువగా ఉంది: కొడాలి నాని

ఉద్యోగుల ఆరోగ్యం పాడవ్వకముందే ఈ జీవోకు సవరణ చేయాలన్నారు.యు ట్యూబ్ విలేకరులపైన కేసులు పెడుతున్నారని బండి సంజయ్‌ ఆరోపించారు. నిన్ను, నీ కొడుకును ఎట్టి పరిస్థితుల్లో వదలం..నీ కొడుకు మైండ్ కరాబు అయిందంటూ కేటీఆర్‌పై విమర్శలు గుప్పించారు.ఈ సమస్యను ఇంకా జటిలం చేయాలని చూడొద్దన్నారు. ఉద్యోగుల ఇప్పుడు పోరాటం చేయండి, మీరు చేయకపోతే మీరే నష్ట పోతారు, మీ వెంట మేము, బీజేపీ పార్టీ అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. అవసరమైతే ముఖ్యమంత్రి ఉద్యోగులను, ఉద్యోగ సంఘాలు చీల్చి పరిపాలన చేస్తున్నాడని దుయ్యబట్టారు. నిరుద్యోగ సమస్య మీద పోరాడుదాం.. ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో తెలుసా అంటూ కేసీఆర్‌ను విమర్శించారు. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి నీ ప్రజలు పరిగెత్తిస్తారని బండి సంజయ్‌ చెప్పారు.

Related Articles

Latest Articles