Family feuds: ఐరన్ రాడ్డుతో నడిరోడ్డుపై భార్యను కొట్టి చంపిన భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Family feuds: ప్రస్తుత కాలంలో కుటుంబ కలహాలు, వివాహేతర సంబంధాల వల్ల దంపతులు గొడవలు పెట్టుకుంటున్నారు. చిన్న చిన్న సమస్యలను పెద్దవి చేసుకుని కొంతమంది ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా.. లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆశంనగర్ లో అందరూ చూస్తుండగానే రోడ్డుపై భార్యను అతికిరాతకంగా చంపాడు భర్త. దీంతో భాగ్యనగరం ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. అది చూసిన స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. నగరంలో మహమ్మద్ యూసుఫ్ కు కరీనా బేగం తో ఏడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరిద్దరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే సంవత్సరం నుండి భార్యాభర్తల మధ్య తగాదాలు రావడంతో ఇద్దరు వేరువేరుగా ఉంటున్నట్లు బంధువులు తెలిపారు. భార్య ఓ ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తు కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. కాగా కొంతకాలంగా భర్త ఆమెను చంపాలని పన్నాగం పన్నాడు. ఎలాగైనా ఆమె ఒక్కటిగా కనిపిస్తే చంపేందుకు ప్లాన్ వేసుకున్నాడు.
Read also: Jagga Reddy: గవర్నర్ ప్రసంగంపై జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు
Also Read
చివరికి ఆ సమయం రానే వచ్చింది. ఇవాళ ఉదయం కాపు కాసి కరీమా బేగం స్కూల్ కి వెళ్తున్న సమయంలో ఐరన్ రాడ్డుతో ఆమెపై ఒక్కసారిగా రోడ్డుపై అందరూ చూస్తుండగానే దాడి చేసి హతమార్చాడు. అక్కడనుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా.. స్థానికులు అతన్ని పట్టుకుని దేహశుద్ది చేశారు. వెంటనే పోలీసులకు సమచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడు యూసుఫ్‌ను అదుపులో తీసుకున్నారు. సదరు మహిళ కరీమా బేగం అక్కడికక్కడే మృతి చెందింది. కరీమా మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. క్లూస్ టీం సంఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ ను సేకరిస్తున్నారు. ఆమెపై అనుమానంతో ఇలా చేశాడా? లేక భర్తను దూరం పెట్టినందుకు చంపేశాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Tension at Gandhi Bhavan: గాంధీభవన్ వద్ద ఉద్రికత.. షబ్బీర్ అలీ, మల్లు రవి అరెస్ట్
తాజావార్తలు
-
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో సరికొత్త శకం.. ఐర్లాండ్‌తో నేడే భారత్ తొలి టీ20..
-
Petrol Diesel Rates: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్ ఉందా? సామాన్యులకు గుడ్ న్యూస్ అందబోతోందా!
-
Ketan Agrawal Case: కేతన్ హత్యపై స్పందించిన రాజా రఘువంశీ కుటుంబం.. ఏం డిమాండ్ చేశారంటే..!
-
Poori vs Paratha: పూరీ Vs పరాఠా.. దేనితో ఆరోగ్యానికి ఎక్కువ ప్రమాదం..? తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
-
Ketan Agarwal Case: ‘పెళ్లి నుంచి తప్పించుకోలేవు’.. కేతన్పై సియా గోయల్ సంచలన ఆరోపణ
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!