Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో సరికొత్త శకం.. ఐర్లాండ్‌తో నేడే భారత్ తొలి టీ20..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్లో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో సరికొత్తగా రూపుదిద్దుకున్న యువ టీమిండియా, శుక్రవారం (జూన్ 26) బెల్ఫాస్ట్లో ఐర్లాండ్‌తో జరిగే తొలి టీ20 మ్యాచ్‌లో తలపడనుంది. గాయం కారణంగా దూరమైన సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఈ సిరీస్‌కు జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యారు. లాంగ్ గ్యాప్ తర్వాత టీ20 జట్టులోకి అడుగుపెట్టిన శ్రేయస్, మొదటిసారిగా భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్నారు. ఈ పర్యటనలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం ఉండటంతో ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.
శ్రేయస్ అయ్యర్ పిలుపు
తొలి మ్యాచ్‌కు ముందు బెల్ఫాస్ట్లో జరిగిన జట్టు సమావేశంలో (టీమ్ హడిల్) కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సహచరుల్లో కొత్త జోష్ నింపారు. కొత్త కెప్టెన్‌కు కోచ్ గౌతమ్ గంభీర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అయ్యర్ మాట్లాడుతూ.. “భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం నాకొక గౌరవం, వరం. మనమంతా ఒక కుటుంబంలా ఉంటూ, కష్ట సమయాల్లో ఒకరికొకరు తోడుగా నిలిచే బలమైన బంధాన్ని నిర్మించుకుందాం. మైదానంలోకి దిగితే సింహాల్లా పోరాడాలి, ప్రతి మ్యాచ్‌ను గెలిచేందుకే ఆడాలి. ఆటను ఆస్వాదిస్తూ, ఒకరి విజయాన్ని మరొకరు సెలబ్రేట్ చేసుకోవాలి” అని భావోద్వేగంగా ప్రసంగించారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పంచుకుంది.
Also Read
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
- iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
- Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
వైస్ కెప్టెన్‌గా తిలక్ వర్మ..
ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను (2024), పంజాబ్ కింగ్స్‌ను (2025) ఫైనల్స్ చేర్చిన ఘనమైన కप्ताనీ అనుభవం శ్రేయస్ అయ్యర్‌కు ఉంది. ఈ సిరీస్‌లో అక్షర్ పటేల్ జట్టులో ఉన్నప్పటికీ, యువ ఆటగాడు తిలక్ వర్మకు వైస్ కెప్టెన్ బాధ్యతలను అప్పగించడం విశేషం. గంభీర్-అయ్యర్ ద్వయం సరికొత్త వ్యూహాలతో, దూకుడుతో కూడిన విప్లవాత్మకమైన టీమ్ కల్చర్‌ను తీసుకురావడానికి సిద్ధమైంది. అటు యువతతో, ఇటు సీనియర్లతో పటిష్టంగా ఉన్న భారత జట్టు ఐర్లాండ్ గడ్డపై ఘనవిజయంతో ఈ సిరీస్‌ను ప్రారంభించాలని భావిస్తోంది.
తాజావార్తలు
-
Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
-
Sidharth – Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
-
Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!