IAS Transfers : తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ
- తెలంగాణలో 13 మంది ఐఏఎస్‌ల బదిలీ
- సీఎం కార్యాలయంలో కీలక నియామకాలు
- ప్రధాన శాఖలకు అదనపు బాధ్యతలు
- మున్సిపల్, పర్యాటక విభాగాల్లో కొత్త పోస్టింగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IAS Transfers : తెలంగాణ రాష్ట్రంలో ఐఏఎస్ (IAS) అధికారుల పరిపాలన విభాగంలో ప్రభుత్వం పెద్ద ఎత్తున మార్పులు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 మంది కీలక ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగానే, ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె. రామకృష్ణారావుకు పదవీ విరమణ అనంతరం ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ముఖ్యమంత్రి కార్యాలయం , విపత్తుల నిర్వహణలో కీలక మార్పులు
ఈ తాజా బదిలీల్లో భాగంగా ముఖ్యమంత్రి కార్యాలయంలో అత్యంత కీలక నియామకం జరిగింది. సీనియర్ ఐఏఎస్ అధికారి ఎన్. శ్రీధర్‌ను ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, సెలవుల నుంచి తిరిగి విధుల్లో చేరిన రాహుల్ బొజ్జాను విపత్తుల నిర్వహణ శాఖ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. దీనితో పాటు ఆయనకు వెనుకబడిన తరగతుల (బీసీ) సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతలను ప్రభుత్వం కొనసాగించింది.
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
ప్రధాన శాఖలకు అదనపు బాధ్యతల కేటాయింపు
పరిపాలనా సౌలభ్యం కోసం పలువురు సీనియర్ అధికారులకు అదనపు బాధ్యతలను అప్పగించారు. సబ్యసాచి ఘోష్‌కు హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్ & హ్యాండీక్రాఫ్ట్స్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు (FAC) ఇవ్వడంతో పాటు, టీజీ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వీసీ & ఎండీగా, టీజీకో (TGCO) ఎండీగా బాధ్యతలు అప్పగించారు. శైలజా రామయ్యర్‌ను ఎండోమెంట్స్ (దేవాదాయ) శాఖ ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేస్తూనే, ఈపీటీఆర్ఐ (EPTRI) డైరెక్టర్ జనరల్‌గా అదనపు బాధ్యతలు ఇచ్చారు. అహ్మద్ నదీమ్‌ను రాజకీయ వ్యవహారాల (పొలిటికల్) ప్రధాన కార్యదర్శిగా నియమించి, మైనారిటీల సంక్షేమ శాఖకు అదనపు బాధ్యుడిగా చేర్చారు. అలాగే ఎం. రఘునందన్ రావుకు గనులు & భూగర్భ శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు దక్కాయి.
మున్సిపల్, పర్యాటక రంగాల్లో నూతన పోస్టింగులు
రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లు, మున్సిపల్ విభాగాల్లో కూడా బదిలీలు జరిగాయి. బి. అజిత్ రెడ్డిని ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా బదిలీ చేయగా, ముషర్రఫ్ అలీ ఫారూకీకి టీజీఆర్ఈడీసీవో (TGREDCO) వీసీ & ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. పి. కాత్యాయనీ దేవిని హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్ & హ్యాండీక్రాఫ్ట్స్ ప్రత్యేక కార్యదర్శిగా నియమిస్తూ, ఆమెకు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ జాయింట్ ఎండీగా అదనపు బాధ్యతలు ఇచ్చారు. అలాగే కె. గంగాధర్‌ను రోడ్లు & భవనాల (R&B) శాఖ ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ చేశారు. నగరాల విషయానికి వస్తే, ఇప్పటివరకు హెచ్ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా ఉన్న టి. వెంకన్నను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ (GWMC)గా బదిలీ చేశారు. ఆయన స్థానంలో హెచ్ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా కే. చంద్రకళకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించగా, రాష్ట్ర పర్యాటక శాఖ (Tourism) డైరెక్టర్‌గా కె. విద్యాసాగర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తాజావార్తలు
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు