హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం భూములపై హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. భూములపై హెచ్సీయూకీ చట్టబద్ధత హక్కులపై ఆధారాలు లేవని హైకోర్టు తీర్పును వెలువరించింది. భూములపై హక్కలు కోసం సివిల్ కోర్టును ఆశ్రయించవచ్చని హెచ్సీయూకి హైకోర్టు సూచించింది. జీహెచ్ఎంసీ రోడ్డు నిర్మించడాన్ని సవాల్ చేస్తూ హెచ్సీయూలో దాఖలైన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది.
Read Also:అభివృద్ధిలో విద్య కీలక భూమిక పోషిస్తుంది: ఏపీ గవర్నర్
కాగా హెచ్ సీయూకి 1975లో 2,324 ఎకరాల భూమిని నాటి ప్రభుత్వం కేటాయించింది. అయితే భూ కేటాయింపుపై ఉత్తర్వులు, ఉన్నట్టు ఇతర ఎలాంటి ఆధారాలు లేవని హైకోర్టు స్పష్టం చేసింది. ఏమైనా ఆధారాలు ఉంటే కోర్టుకు సమర్పించాలని ఈ సందర్భంగా హైకోర్టు పేర్కొంది.