Hariah Rao: రైతులకు రూ.10వేలు ఇవ్వండి.. ప్రభుత్వానికి హరీష్ రావు డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hariah Rao: రైతులకు రూ.10వేలు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని కోరారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి తదితర జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన అన్నదాతను అతలాకుతలం చేసింది. పంటలు చేతికి రానున్న సమయంలో కురిసిన వడగండ్ల వాన రైతులకు కన్నీరు మిగిల్చిందని తెలిపారు.
Read also: TDP MP Candidates List: సిద్ధమైన టీడీపీ ఎంపీల జాబితా..! ఈ రోజే విడుదలకు ఛాన్స్..
Also Read
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్‌ను
- Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
- Adluri Laxman : కేటీఆర్ సరూర్ నగర్ సభలో మాట్లాడించింది పెయిడ్ ఆర్టిస్టులతోనే
వరి, మొక్కజొన్న, జొన్న పంటలతోపాటు బొప్పాయి, మామిడి సహా ఇతర ఉద్యాన పంటలు దెబ్బతినడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. గతంలో అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోతే, అప్పటి ముఖ్యమంత్రి కేసిఆర్ గారు స్వయంగా వెళ్లి రైతులను పరామర్శించి భరోసా కల్పించారు. అక్కడికక్కడే ఎకరాకు రూ. 10 నష్టపరిహారం ప్రకటించి అమలు చేశారని గుర్తు చేశారు. రెండు, మూడు రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నప్పటికీ, ప్రభుత్వం కనీసం స్పందించడం లేదు. రాజకీయాలు తప్ప, రైతు ప్రయోజనాలు పట్టని కాంగ్రెస్.. ఇప్పటికైనా మేల్కొని అన్నదాతకు అండగా నిలవాలని కోరారు. జరిగిన పంట నష్టాన్ని తక్షణమే అంచనా వేయడంతో పాటు, ఎకరాకు రూ. 10 వేల నష్ట పరిహారం చెల్లించాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు.
Read also: IPL 2024: ఐపీఎల్‌లోకి టీమిండియా మాజీ క్రికెటర్.. ఇక మైదానంలో మాటల హోరే!
కాగా.. రాజన్న సిరిసిల్ల నియోజకవర్గంలో రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు మండలాలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించాయి. విర్నపల్లిలో వరి కోత దశలో ఉన్న పంట పొలాలపై ఆకాల వడగళ్ల వర్షానికివరి పంటలు నేల రాలాయి. దీంతో రైతులు లబోదిబో అంటున్నారు. ఇక సంగారెడ్డి జిల్లాలో అన్నదాతను వర్షం ఆగం చేసింది. ఆకాలవర్షంతో వరి, మొక్కజొన్న, జొన్న పంటలు పలుచోట్ల నెలకొరిగాయి. ఈదురుగాలులకు మామిడి పంట రాలిపోయింది. పంట చేతికివచ్చే సమయానికి నేలపాలయ్యిందని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
DGP Brothers: సొంత అన్నదమ్ముళ్లే ఆ రెండు రాష్ట్రాలకు పోలీస్ బాస్ లు..!
తాజావార్తలు
-
Bangladesh: భారత్, పాకిస్థాన్‌ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
-
Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
-
YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
-
CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!