IPL 2024: ఐపీఎల్‌లోకి టీమిండియా మాజీ క్రికెటర్.. ఇక మైదానంలో మాటల హోరే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Navjot Singh Sidhu returned to commentary for IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో టీమిండియా మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ సందడి చేయనున్నారు. ఐపీఎల్ 2024లో సిక్సర్ల సిద్దూ కామెంటేటర్‌గా వ్యవహరించనున్నారు. ‘స్టార్ స్పోర్ట్స్’ తరఫున సిద్దూ కామెంటేటర్‌గా అలరించనున్నారు. ఈ విషయాన్ని స్టార్ స్పోర్ట్స్ మంగళవారం తన ఎక్స్ వేదికగా తెలిపింది. సిద్దూను ‘సర్ధార్ ఆఫ్ కామెంటరీ బాక్స్’గా పేర్కొంది. సిద్ధూ తన మాటలతో అలరిస్తారన్న విషయం తెలిసిందే.
టీమిండియా మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ భారత్ తరఫున 187 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు. 15 సంవత్సరాల కెరీర్‌లో 51 టెస్టులు, 136 వన్డేలు ఆడి.. వరుసగా 3202, 4413 పరుగులు చేశాడు. సిద్ధూ 15 సెంచరీలు, 48 అర్ధ సెంచరీలు చేశారు. సిద్ధూ తన ట్రేడ్ మార్క్ ఇన్నింగ్స్‌లతో ఫ్యాన్స్‌ను అలరించారు. 1983 నుంచి 1998 వరకు భారత్ తరపున ఆడాడు. ఆటకు దూరమయ్యాక రాజకీయాల్లో బిజీగా ఉన్న సిద్దూ.. ఇప్పుడు మరోసారి తన మాటలతో స్టేడియాన్ని హోరెత్తించడానికి సిద్ధమయ్యారు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
Also Read: PSL 2024: మ్యాచ్ మధ్యలో ఆ పని చేసిన పాకిస్తాన్ క్రికెటర్.. వీడియో వైరల్!
60 ఏళ్ల నవజ్యోత్ సింగ్ సిద్ధూ కామెంటరీ చేయడం ఇదే మొదటిసారి కాదు. 2001లో భారత్, శ్రీలంక పర్యటనలో సిద్ధూ కామెంటరీ చేశారు. తన విలక్షణమైన మాటలతో అందరిని అలరించారు. చమత్కారమైన మాటలకు ప్రసిద్ధి చెందిన సిద్ధూ.. ఐపీఎల్ 2024లో ఎలా అలరిస్తారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాను ఆడిన రోజుల్లో భారతదేశపు అత్యంత స్టైలిష్ క్రికెటర్లలో ఒకడిగా సిద్ధూ పేరుగాంచారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!