Suspicious death: కొన్ని మరణాలు ఎవరికి అంతుచిక్కవు. అసలు వారు ఎలా మరణిస్తారో అర్థంకానీ పజిల్ గా మారుతుంది. కొన్ని ఘటనలు చూస్తే మరణం ఇలా కూడా ఉంటుందా అని పిస్తుంది. ఎప్పుడు ఏ కోణం నుంచి మృత్యువు కబలిస్తుందో అర్థంకాదు. ఓ యువకుడు మద్యం కొనుగోలు చేసేందుకు వెళ్లాడు. పక్కనే కల్లు దుకాణం వద్ద ఉన్న మహిళతో మాటలు కలిపి ఇంటికి తీసుకెళ్లాడు. తెల్లారి ఆమె విగతజీవిగా కనిపించింది. నిర్ఘాంత పోయిన ఆయువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
Read also: Tues Day Bhakthi tv Live: మంగళవారం ఈ స్తోత్రాలు వింటే..
ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన యువకుడు బీటెక్ పూర్తి చేశాడు. జీడిమెట్లలోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. తల్లి, సోదరితో కలిసి చింతల్‌లోని ఓ కాలనీలో ఉంటున్నాడు. కుటుంబ సభ్యులు ఊరెళ్లటంతో శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో మద్యం కొనుగోలు చేసేందుకు చింతల్ వెళ్లాడు. అక్కడి కల్లు దుకాణంలో నుంచి ఓ మహిళ రావటం గమనించాడు. ఆమె వద్దకెళ్లి మాటలు కలిపాడు. ఇంటికి తీసుకెళ్లాడు. ఇద్దరూ కలసి మద్యం తాగారు. శనివారం ఉదయం 5 గంటలకు నిద్రలేచిన ఆ యువకుడు ఆ మహిళ నోటివెంట నురగలు రావటం గమనించాడు. అపస్మారకస్థితిలో ఉన్న ఆమెను చూసి ఆందోళనకు గురయ్యాడు. ఏం చేయాలో పాలుపోక స్నేహితుడికి ఫోన్ చేశాడు. అతడి సూచన మేరకు జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి వివరాలు తెలిపాడు. ఆదివారం ఉదయం పోలీసులు ఆ యువకుడి గదికి వెళ్లి ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా మహిళ మరణంపై స్పష్టత వస్తుందని తెలిపారు. పచ్చబొట్టే ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. మహిళకు వివరాలు లభ్యం కాకపోవడంతో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఆమె చేతిపై సంతోష్, సాయిలు, నరేష్ అనే పేర్లు ఉన్నాయి. మృతురాలి వివరాలు సేకరించటం పోలీసులకు సవాల్‌గా మారింది.
Harassment: నీటి సంపులో బాలుడు.. అత్తింటి వారిపై కేసుపెట్టిన కోడలు