Cheddi Gang: కొద్దిరోజులు సైలెంట్ అయ్యారు. మళ్లీ ఇప్పుడు షురూ అయ్యారు. వీరు అల్లాటప్పా గ్యాంగ్ కాదండోయ్ వీరందరి బ్యాచ్ ఒక్కటే డ్రస్సింగ్ కోడ్ యూస్ చేస్తారు. అదే చడ్డీ. ఏదైనా ఇంటికి తాళం ఉంటే చాలు చెడ్డీ వేసుకుని దుప్పట్లు, మెఖానికి మాస్క్ వేసుకుని దోచుకోవడమే. సినిమాలో డైరెక్టర్, ప్రొడ్యూసర్ చెప్పినట్లు దొంగతనాలు చేస్తే.. ఇక్కడ మాత్రం చెడ్డీలు వేసుకుని ఇంట్లో చొరబడి ఐడియాలతో ఎవరికి కనిపించకుండా బయటకు సొమ్ము దోచుకుని పరారవుతారు. ఇది ఇప్పటి రోజుల్లో మొదలైంది కాదండోయ్.. చెడ్డీ గ్యాంగ్ 1987 నుంచే ఉందంటే ఆశ్చర్య పోనవసరం లేదు. 1999 వరకు కూడా పోలీసులు వీరిని కళ్లు గప్పి ఎంత చాకచక్యంగా చేసారో అర్థం చేసుకోవచ్చు. దీంతో ప్రజలు భయభ్రాంతులు లోనయ్యారు. కొద్ది రోజులు చెడ్డీ గ్యాంగ్ అంటే హల్ చల్ చేసిన వీరు.. ఇప్పుడు మళ్లీ దొంగ తనానికి తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తున్నారు. సైలెంట్ గా ఉన్న చెడ్డీ గ్యాంగ్ నగరంలో మరోసారి చెడ్డీ గ్యాంగ్ సందడి చేసింది.
Read also: Basara IIIT: వీకెండ్ విత్ వీసీ.. విద్యార్థుల సమస్యలు నేరుగా చెప్పుకునే ఛాన్స్
మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వసంత విలాస్ లో తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీకి పాల్పడ్డారు. తాళం వేసి ఉన్న విల్లాలోకి చొరబడి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లింది చెడ్డీ గ్యాంగ్. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత చెడ్డీ గ్యాంగ్ చోరీకి పాల్పడ్డారు. రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా చెడ్డీ గ్యాంగ్ చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. కొండాపూర్ గేటెడ్ కమ్యూనిటీల్లోనూ చెడ్డీ గ్యాంగ్ బీభత్సం సృష్టించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు కూడా సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో మాదాపూర్ ఎస్ ఓటీ, సీసీఎస్ క్రైం బృందాలు దొంగల ఆచూకీ కోసం వెతుకుతున్నారు. మంగళవారం స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో సోమవారం ఒక్కరోజు సెలవు ఇస్తే చాలా మంది ఉద్యోగులకు నాలుగు రోజులు సెలవులు వస్తాయి. దీంతో చాలా మంది హైదరాబాదీలు తమ ఇళ్లకు వెళ్లాలన్నా.. విహారయాత్రలకు వెళ్లాలన్నా ప్లాన్ చేసుకుంటున్నారు. శంషాబాద్ విమానాశ్రయం ఇప్పటికే ప్రయాణికులతో కిటకిటలాడింది. లాంగ్ వీకెండ్ ఎంజాయ్ చేసేందుకు ఇళ్లకు తాళాలు వేసి గ్రామాలకు వెళ్లే జనం.. చెడ్డీ గ్యాంగ్ కదలికల నేపథ్యంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇంటికి తాళం వేసి పోలీసులకు ముందే చెబితే పోలీసులు రాత్రిపూట ఇంటింటా గస్తీ తిరుగుతూ ఇంటిపై దృష్టి సారిస్తారు.
Read also: Bhola Shankar: భోళా శంకర్ సినిమా నిలిపివేత.. థియేటర్ సీజ్
1987 నుంచే చెడ్డీ గ్యాంగ్ చోరీలు..?
1987 నుంచి చోరీలకు పాల్పడుతున్న చెడ్డీ గ్యాంగ్.. 1999 వరకు పోలీసులకు తెలియలేదంటే ఎంత చాకచక్యంగా చోరీలు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. గత కొన్నేళ్లుగా సీసీ కెమెరాల వినియోగం పెరగడంతో వాటి కదలికలు తెలుస్తున్నాయి. గుజరాత్‌లోని ధావోద్ జిల్లా గుడ్ బాలా తాలూకాలోని నహెడా అనే గ్రామంలో ఈ చెడ్డీ గ్యాంగ్ పుట్టింది. ఫేస్ పర్తి తెగకు చెందిన వారు పంటలు పండిస్తూ, అటవీ జంతువులను వేటాడుతూ జీవించేవారు. వన్యప్రాణుల వేటను ప్రభుత్వం నిషేధించడంతో పాటు వ్యవసాయం కష్టతరంగా మారడంతో చోరీలకు పాల్పడ్డారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో గతంలోనూ చెడ్డీ గ్యాంగ్ చోరీలకు పాల్పడింది. దొంగతనానికి వెళ్లేటప్పుడు మాత్రమే నిక్కర్లు వేసుకుంటారు. ఇటీవల విడుదలైన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తే.. కొందరు దుండగులు వలలు ధరించి, ముఖం కనిపించకుండా కర్చీఫ్ కట్టుకుని ఉన్నారు. కొందరైతే మృతదేహాన్ని ఏమాత్రం కనిపించకుండా దుప్పట్లు కప్పారు. ఈ చెడ్డీ గ్యాంగ్ దోపిడీల క్రమంలో హత్యలకు వెనుకాడదు. గత కొంత కాలంగా సైలెంట్ గా ఉన్న ఈ గ్యాంగ్ మళ్లీ రచ్చ చేస్తోంది. దీంతో వారిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
K. A. Paul: పవన్, చిరంజీవి ప్యాకేజీ స్టార్లు.. మీరు వాళ్ల మాటలు నమ్మితే అంతే..!