చాలా రోజుల తర్వాత చెడ్డీ గ్యాంగ్ సంచారం మళ్లీ కలకలం రేపుతోంది. శనివారం అర్ధరాత్రి మియాపూర్లో చెడ్డీ గ్యాంగ్ హల్ చల్ చేసింది. వరల్డ్ వన్ స్కూల్ లోకి కొంతమంది చెడ్డీలు ధరించి.. ముఖానికి మాస్క్ కట్టుకుని పదునైన ఆయుధాలతో ఒంటిమీద బట్టలు లేకుండా చొరబడ్డారు. అనంతరం స్కూల్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లో గల కౌంటర్ లో ఉన్న 7 లక్షల 85 వేల నగదును దొంగలు దోచుకెళ్లారు.
Cheddi Gang: కొద్దిరోజులు సైలెంట్ అయ్యారు. మళ్లీ ఇప్పుడు షురూ అయ్యారు. వీరు అల్లాటప్పా గ్యాంగ్ కాదండోయ్ వీరందరి బ్యాచ్ ఒక్కటే డ్రస్సింగ్ కోడ్ యూస్ చేస్తారు.
విశాఖలో అర్థరాత్రి రెచ్చిపోయారు దొంగలు.. పెందుర్తి చీమలాపల్లిలో అర్ధరాత్రి సమయంలో ఓ ఇంట్లోకి చొరబడ్డ దొంగలు.. అందినకాడికి దోచుకున్నారు.. కిటికీ తొలగించి ఇంట్లోకి చొరబడ్డారు ఇద్దరు దొంగలు.. ఈ సమయంలో ఇంట్లో మొత్తం ముగ్గురు వ్యక్తులు ఉన్నట్టుగా తెలుస్తోంది.. ఇంట్లో నిద్రిస్తున్న సుమారు 25 సంవత్సరాల మహిళను వారు తెచ్చుకున్న స్క్రూడ్రైవర్‌తో పొడిచి తీవ్రగాయాలు చేశారు.. ఇక, అత్త మామ నిద్రిస్తున్న రూమ్‌కు బయటనుంచి గడియ పెట్టి పరారయ్యారు దొంగలు.. అయితే, దొంగల ప్రయత్నాన్ని సదరు మహిళ…