రీజినల్ రింగ్‌రోడ్డు నిర్మాణానికి మరో ముందడుగు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైద్రాబాద్ నగరం చుట్టూ రీజీనల్ రింగురోడ్డు (RRR) నిర్మాణానికి మరో ముందడుగు పడింది. తొలిదశ నిర్మాణం కోసం భూ సేకరణను ప్రారంభించింది. దీనిపై కేంద్రం భూసేకరణ ప్రక్రియను చేపట్టాల్సిందిగా కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ తెలంగాణ ప్రభుత్వానికి తాజాగా లేఖ రాసింది. సంగారెడ్డి, నర్సాపూర్, తూఫ్రాన్, గజ్వేల్, యాదాద్రి భువనగిరి, చౌటుప్పల్ మీదుగా నిర్మించే ఈ మార్గానికి కేంద్రం ఇటీవల ఆమోదం తెలిపింది.
Also Read
వచ్చే 25-30 ఏళ్ల ట్రాఫిక్ అంచనాల మేరకు దీన్ని నిర్మించ నున్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డుకు అవతల 338 కిలోమీటర్ల మేర ప్రాంతీయ రింగురోడ్డు నిర్మాణానికి కేంద్రం ఓకే చెప్పింది. వివిధ ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వద్ద ఆయా మార్గాల్లో మార్పులు చేపట్టడానికి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు అంగీకరించడంతో 157 కిలోమీటర్ల మేర ఉత్తర రహదారి నిర్మాణానికి మార్గం సుగమైంది. దక్షిణ భాగంలో రోడ్డు మార్గాలను ఖరారు చేసేందుకు అధ్యయనానికి అనుమతి లభించాల్సిఉంది.
చౌటుప్పల్, చేవేళ్ల, శంకర్‌పల్లి, ఆమన్‌గల్, సంగారెడ్డి మీదుగా 181 కిలోమీటర్ల మార్గానకి జాతీయ హోదా లభించాల్సిఉంది. ఇదిలా ఉంటే తొలిదశలో నిర్మాణానికి భూసేకరణకు కేంద్రం అనుమతిచ్చిన నేపథ్యంలో రాష్ర్టంలో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసి భూసేకరణ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రహదారి మార్గం వెళ్లే ప్రాంతాల్లో ఒక్కో జిల్లాను ఒక్కో యూనిట్‌గా తీసుకోవాలా? లేక నిర్ధారిత కిలోమీటర్లకు ఒక యూనిట్‌ను ఏర్పాటు చేయాలా? అన్న అంశంపై అధికారులు చర్చిస్తున్నారు. సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట, యాదాద్రి-భువనగిరి జిల్లాల మీదుగా వెళ్లే ప్రాంతీయ రింగు రోడ్డు నిర్మాణం జరగనుంది. దీనికోసం సుమారు నాలుగు వేల ఎకరాల వరకు భూమిని సేకరించాలని అంచనా.
భూసేకరణ విభాగం ఏర్పాటు తరువాత ఈ మార్గంలో భూమిని కోల్పేయే వారికి ఎంత మొత్తంలో పరిహారం చెల్లించాలన్నది ఆయా జిల్లాల రెవెన్యూ అధికారులతో సంప్రదింపులు నిర్వహించిన తరువాత అధికారులు ఖరారు చేయనున్నారు. భూసేకరణకు అయ్యే వ్యయాన్ని కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు చెరిసమానంగా భరించాలని ఒప్పందం చేసుకున్నాయి. రీజినల్ రింగ్ రోడ్డు కోసం భూసేకరణను రాష్ర్ట ప్రభుత్వం చేపట్టినప్పటికీ రహదారి నిర్మాణ వ్యవహారాలను కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ పర్యవేక్షించనుంది. భూసేకరణ తర్వాత నిర్మాణ పనుల కోసం టెండర్లను ఆహ్వానించనుంది.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్‌కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!