తీన్మార్ మల్లన్నపై బీజేపీ సీరియస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిజెపి నేత చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు చెందిన ఓ మీడియా సంస్థ.. తెలంగాణ మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు ప్రస్తావనతో ట్విటర్‌లో ఓ పోల్ క్వశ్చన్‌ను పోస్ట్ చేసింది. బాడీషేమింగ్‌తో కూడిన ఆ పోస్ట్ తీవ్ర దుమారం రేపింది. దీనిపై హిమాన్షు తండ్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ వ్యవహారాన్ని కేటీఆర్ సోదరి కవితతో పాటు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, టీఆర్‌ఎస్ నేత బాల్క సుమన్ తదితరులు ఖండించారు. ఈ ఘటనపై బీజేపీ అధిష్టానం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు టీఆర్‌ఎస్ శ్రేణులు ఈ వ్యవహారంపై బీజేపీని కడిగిపారేస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలోనే బీజేపీ స్పందించింది.
నవీన్‌వి వ్యక్తి గత కామెంట్సే అయినప్పటికీ.. ఇలాంటి చేష్టల్ని పార్టీ సహించబోదని చెప్తోంది. రాజకీయ ప్రత్యర్థులైనప్పటికీ.. వాళ్ల కుటుంబ సభ్యులపై వ్యక్తిగత విమర్శలను అంగీకరించబోమని స్పష్టం చేసింది. అయితే ఈ వ్యవహారంలో మల్లన్నపై చర్యలు ఉంటాయా? ఉంటే ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక వ్యక్తిగత విమర్శలకు దూరం అంటున్న బీజేపీ నేతలు.. పార్టీలో మల్లన్న ఒక్కరే కాదు ఎవరు చేసినా తప్పేనంటూ వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు సీఎం కేసీఆర్ కుటుంబంలో రాజకీయ నేతలపై మాత్రమే తమ పోరాటమని కమల శ్రేణులు చెప్తున్నాయి.
Also Read
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Cheyutha Pension : చేయూత పింఛన్‌కు రేపే డెడ్‌లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్‌కు హరీశ్ రావు లేఖ..!
తాజావార్తలు
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్‌తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్‌గా..
-
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!