Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్‌గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
- రాహుల్ గాంధీ సుప్రీంకోర్టు మార్చ్‌పై అభ్యంతరం
- న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరన్న సీజేఐ
- జంతర్ మంతర్ నిరసన స్థలంపై ప్రభుత్వ స్పందనను ముందుగా చూస్తామని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ అన్నారు. ‘సర్’ రద్దు చేయాలంటూ కాంగ్రెస్ అగ్ర నేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారించింది. అయితే రాహుల్ గాంధీ పాదయాత్రగా వెళ్లి పిటిషన్ వేయడంపై కూడా చర్చకు వచ్చింది. సుప్రీంకోర్టు ప్రాంగణం వరకు పాదయాత్రగా రావడంపై సీనియర్ న్యాయవాది గౌరవ్ భాటియా అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి సీజేఐ స్పందిస్తూ.. ‘‘మేము వాస్తవ ప్రపంచానికి అతీతులం కాదు. మాకు అన్ని విషయాలూ తెలుసు. న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు.’’ అని వ్యాఖ్యానించారు.

Also Read
- CNAP Service: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక నవంబర్ 1 నుంచి ఫోన్లలో కాలర్ పేరు ప్రత్యక్షం!
- Supreme Court: "మతం మారితే రిజర్వేషన్లు వర్తించవు".. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
- Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
- Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసు
సుప్రీంకోర్టు ప్రాంగణంలో రాజకీయ ఊరేగింపు నిర్వహించడాన్ని సీనియర్ న్యాయవాది గౌరవ్ భాటియా తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది ఆమోదయోగ్యం కాదని అన్నారు. న్యాయవ్యవస్థను బెదిరించి, ఒత్తిడి తెచ్చే ప్రయత్నంగా అభివర్ణించారు. న్యాయవాది వ్యాఖ్యలకు ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ.. న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరని.. ఇటువంటి ప్రయత్నాలు చాలా బలహీనమైనవని, వాటిని ఎవరూ పట్టించుకోరని సూర్యకాంత్ అన్నారు. తాము వాస్తవ ప్రపంచానికి దూరంగా కూర్చోలేదని.. తమకు అన్నీ తెలుసని చెప్పారు.
ఇక జంతర్ మంతర్ విషయమై సుప్రీంకోర్టు ఆదేశం మేరకు దానిని నిరసన ప్రదేశాల జాబితా నుంచి తొలగించలేదని ఎస్జీ తుషార్ మెహతా పేర్కొన్నారు. ఒక కమిటీ ఆ సూచన చేసిందని తెలిపారు. నిరసన ప్రదేశాల జాబితా నుంచి జంతర్ మంతర్‌ను తొలగిస్తూ ఢిల్లీ పోలీసులు జారీ చేసిన ఉత్తర్వును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై కోర్టు నోటీసు జారీ చేసింది. తాము ముందుగా ప్రభుత్వ స్పందనను వింటామని, సంతృప్తి చెందకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు పేర్కొంది.
తాజావార్తలు
-
Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్‌గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
-
Yuvraj Singh: ఇప్పుడు కాదు.. 25 ఏళ్లుగా అయనకు అసిస్టెంట్‌నే!
-
Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
-
Anupama: ‘పెళ్లి కాకున్నా బిడ్డ కావాలనుంది!’.. అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖలు
-
Pakistan: పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 21 మంది విద్యార్థులు, టీచర్ మృతి
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!