తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది… ప్రైవేట్ ఆస్పత్రులకు వ్యాక్సిన్ పంపిణీ నిలిపివేస్తూ తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ ఆస్పత్రులకు వెంటనే కోవిడ్ టీకా డోసుల పంపిణీ నిలిపివేయాలంటూ.. రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు… డీఎంహెచ్‌వోలకు ఆదేశాలు జారీ చేశారు.. అయితే, ఇప్పటివరకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌ను వినియోగించుకునే వీలు కల్పించింది.. మిగతా టీకాలను వెంటనే సేకరించాలని హెల్త్ డైరెక్టర్ ఆదేశించారు.. కాగా, జనవరి 25వ తేదీ నుంచి రాష్ట్రంలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్ జరుగుతుంది.. ప్రస్తుతం 45 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సినేషన్ జరుగుతుండగా.. రేపటి (మే 1వ తేదీ) నుంచి 18 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంది.. కానీ, ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు సర్కార్.. వ్యాక్సిన్ల కొరత ఇప్పటికే వెంటాడుతున్నందున 18 + ఏజ్ వాళ్లకు వ్యాక్సిన్ సాధ్యం కాదంటున్నారు.. మరోవైపు.. ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామంటూ సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.