Telangana : తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న లక్షలాది విద్యార్థులకు గుడ్ న్యూస్. రాబోయే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వం మరో సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకం కొనసాగుతుండగా, ఇప్పుడు ఉదయం అల్పాహారం కూడా అందించేందుకు విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో తమిళనాడు మోడల్‌ను అనుసరించి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఉదయం అల్పాహార పథకం’ అమలు కానుంది. దీనికి సంబంధించిన పూర్తి ప్రణాళికను పాఠశాల విద్యాశాఖ అధికారులు రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు.
రాష్ట్రంలో సుమారు 25,000 ప్రభుత్వ పాఠశాలల్లో 17.5 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ అల్పాహారం అందించడానికి సంవత్సరానికి సుమారు రూ. 400 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా. ఇందులో కేవలం ఆహార ఖర్చు రూ. 360 కోట్లు, వంటసామాగ్రి, గ్యాస్ పొయ్యిలు, నిర్వహణ తదితర ఖర్చులు కలిపి మొత్తం రూ. 400 కోట్ల వరకు చేరతాయి.
బ్రేక్‌ఫాస్ట్ మెనూలో వారంలో మూడు రోజులు అన్నంతో పులిహోర, వెజ్ బిర్యానీ, కిచిడీ వంటకాలు, మిగతా రెండు రోజులు ఉప్మా, రవ్వ కిచిడీ వంటి అల్పాహార పదార్థాలు ఉండనున్నాయి. ఒక్క విద్యార్థికి రోజుకు సగటున రూ. 10 ఖర్చు పడతుందని అధికారులు లెక్కించారు. రోజుకు సుమారు 16 లక్షల మంది విద్యార్థులు అల్పాహారం పొందుతారని పరిగణనలో, రోజువారీ వ్యయం రూ. 1.6 కోట్లు అవుతుంది.
Nadiya : 12వ తరగతిలోనే ప్రేమలో పడ్డా.. పవన్ అత్త నదియా కామెంట్స్