తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న లక్షలాది విద్యార్థులకు గుడ్ న్యూస్. రాబోయే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వం మరో సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉంది.
Talliki Vandanam Scheme: సాంఘీక సంక్షేమ శాఖ డైరెక్టర్ గుడ్‌న్యూస్ చెప్పారు. ఆందోళన వద్దు... త్వరలోనే మిగిలిన తల్లికి వందనం సొమ్ము జమ చేస్తామని ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో 9,10 తరగతులు, ఇంటర్మీడియట్ చదువుతున్న ఎస్సీ విద్యార్థులు 3.93 లక్షల మంది ఉన్నారని తెలిపారు.
CM Revanth Reddy : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందాలని… ఇందుకు అవసరమైన మౌలిక వసతులు, ఉపాధ్యాయులకు శిక్షణ, ఇతర సదుపాయాల కల్పనకు ఎంత వ్యయమైనా వెనుకాడేది లేదని సీఎం స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో 20 మంది కన్నా ఎక్కువ పిల్లలున్న గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ ఏడాది కొత్తగా 571 పాఠశాలలు ప్రారంభిస్తున్నామని సీఎం వెల్లడించారు.…
విస్తృత ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం ఇంటర్మీడియట్ బోర్డులో సంస్కరణలకు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పచ్చజెండా ఊపారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 77వ సమావేశం అమరావతి అసెంబ్లీలోని పేషిలో మంత్రి లోకేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఇంటర్మీడియట్‌లో విద్యలో నాణ్యత ప్రమాణాలను పెంపొందించి విద్యార్థులను ప్రభుత్వ జూనియర్ కాలేజీల వైపు ఆకర్షించేలా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Gurukul Students Missing : సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట సమీపంలోని నెమలిపురి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఆరుగురు పదవ తరగతి విద్యార్థులు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. విద్యా సంవత్సరం ముగింపు సందర్భంగా గురుకులంలో ఉపాధ్యాయులు వీడ్కోలు పార్టీ నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు విద్యార్థులు మద్యం సేవించి పార్టీకి హాజరయ్యారు. వారి ప్రవర్తనతో తోటి విద్యార్థులతో గొడవ జరిగింది. ఈ విషయాన్ని ఉపాధ్యాయులు గమనించి వారిని మందలించారు. ఉపాధ్యాయుల మందలింపుతో…
TGSWREIS : ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో ఆహార భద్రత, నాణ్యత ప్రమాణాలకు ఎన్ఐఎన్ సహకారం అందించనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు మరో ముందడుగు వేసింది. ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో ఆహార భద్రతతో పాటు నాణ్యత ప్రమాణాలను పెంపొందించేందుకు హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (జాతీయ పోషకాహార సంస్థ) సహకారం తీసుకుంటోంది. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ…
Bhatti Vikramarka : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బీబీనగర్ ఎస్సీ, బీసీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న ఆయన, మార్గమధ్యంలో ఈ పాఠశాల వద్ద ఆగి విద్యార్థుల సమస్యలు, సౌకర్యాలపై సమీక్ష చేశారు. ఈ సందర్బంగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ తో కలిసి విద్యార్థులతో మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులకు అందుతున్న భోజన మెనూ, కాస్మోటిక్ ఛార్జీల నిధుల వినియోగం,…
Adilabad: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రం సమీపంలోని ప్రభుత్వ పోస్ట్ మెట్రిక్ వసతి గృహంలో మద్యం సేవిస్తున్న మందు బాబులు విద్యార్థులతో ఘర్షణకు దిగిన ఘటన కలకలం రేపుతోంది. వసతి గృహ సమీపంలో కొందరు వ్యక్తులు మద్యం సేవిస్తున్నట్టు గమనించిన విద్యార్థులు, ఇక్కడ మద్యం సేవించడం మంచిది కాదని వారిని హెచ్చరించారు. విద్యార్థులు చేసిన పనిని సీరియస్ గా తీసుకున్న మందు బాబులు మద్యం మత్తులో వసతి గృహంలోకి చొరబడి దాడికి తెగబడ్డారు. ఆ తర్వాత…
Seethakka In Assembly: తెలంగాణ శాసన మండలిలో గురుకుల పాఠశాలల్లో కలుషిత ఆహార సమస్యలపై జరిగిన చర్చలో మంత్రి సీతక్క తీవ్రంగా స్పందించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుందని, హాస్టల్ సిబ్బందితో పాటు సరఫరాదారులపై కూడా నిఘాను పెంచుతామని ఆమె తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో 70 సంఘటనలు నమోదయ్యాయని, అందులో 5024 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని మంత్రి సీతక్క గుర్తుచేశారు. వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ పరిస్థితి…