భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9 వ తేదీల్లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ సజావుగా సాగేందుకు అవసరమైన విద్యుత్ సరఫరా అందించేందుకు గాను దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ విస్తృత ఏర్పాట్లు చేసిందని ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ, ఐఏఎస్ తెలిపారు. 33 /11 కేవీ మీర్ ఖాన్ పేట్ సబ్ స్టేషన్ నుండి సదస్సు జరిగే ప్రాంతానికి ప్రత్యేకంగా రెండు కిలో మీటర్ల నిడివి కలిగిన డబుల్ సర్క్యూట్ అండర్ గ్రౌండ్ కేబుల్ ను ఏర్పాటు చేసారు. ఒక 100 కేవీఏ, రెండు 160 కేవీఏ, రెండు 315 కేవీఏ కెపాసిటీ లు కలిగిన డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లను ప్రాంగణం లోని వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పటు చేసారు. దీనికి తోడు ఒక 315 కేవీఏ కెపాసిటీ కలిగిన మొబైల్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్ ను కూడా అందుబాటులో ఉంచారు.
Vijay Deverakonda: విజయ్ అభిమానులకు షాక్.. ‘కింగ్‌డమ్’ సీక్వెల్‌పై సస్పెన్స్
సంస్థ డైరెక్టర్ ఆపరేషన్స్ డా. నర్సింహులుని సదస్సు కు ఇంచార్జి గా నియమించడం జరిగింది. దీనికి తోడు దాదాపు 150 మంది విద్యుత్ అధికారులు, సిబ్బంది రేపు శనివారం నుండి సదస్సు ముగిసే వరకు ఆ ప్రాంతంలో సరఫరా తీరును పర్యవేక్షిస్తుంటారని సీఎండీ తెలిపారు. శుక్రవారం ఉదయం చీఫ్ ఇంజినీర్లు, సూపెరింటెండింగ్ ఇంజినీర్లతో నిర్వహించిన టెలీకాన్ఫెరెన్స్ లో సీఎండీ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబెల్ సమ్మిట్ కు దేశ, విదేశాలకు సంబంధించిన పలువురు ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు పాల్గొంటారని విద్యుత్ అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా వుంటూ, విద్యుత్ సరఫరా లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహించే సిబ్బంది, అధికారులు ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ సర్కిళ్ల సిబ్బంది తప్పనిసరిగా సేఫ్టీ జాకెట్లు ధరించాలని, క్విక్ రెస్పాన్స్ టీం వాహనాలు, ఇతర పరికరాలు నిత్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Pakistan-Bangladesh: పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లకు అంతర్జాతీయంగా ఘోర అవమానం..