Vijay Deverakonda: ఫ్యాన్ ఇండియా లెవల్‌లో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ. ఈ హీరోకు 2025 లో అదృష్టం అంతగా కలిసి రాలేదని సినీ పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ సినిమా అనేక అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైంది. కానీ ఈ చిత్రం ఊహించినంత మేరకు సక్సెస్ కాలేదనే టాక్ ఉంది. కానీ విజయ్ అభిమానులతో పాటు, సినీ ప్రేక్షకులు కూడా ఈ చిత్రం సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రూమర్స్ విజయ్ అభిమానులను షాక్‌కు గురి చేశాయి. ఇంతకీ ఈ సినిమాకు సంబంధించి జోరుగా ప్రచారంలో ఉన్న రూమర్స్ ఏంటో తెలుసా..
READ ALSO: Smriti Mandhana: స్మృతి మంధానతో పెళ్లి క్యాన్సిల్.. పలాష్ ముచ్చల్ సంచలన వ్యాఖ్యలు..
కింగ్‌డమ్ రెండవ భాగం నిలిపి వేస్తున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ సినిమాను నిర్మాతలు రెండు భాగాలుగా తెరకెక్కించాలని ప్లాన్ చేశారు. అయితే మొదటి భాగానికి వచ్చిన స్పందనను చూసి, రెండవ భాగం తెరకెక్కించకపోవచ్చనే రూమర్స్ తాజాగా బయటికి వచ్చాయి. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చిందని, సినిమాకు పెట్టిన బడ్జెట్‌ను కూడా తిరిగి రాబట్టలేకపోవడంతో ప్రస్తుతానికి సెకండ్ పార్ట్ చిత్రీకరణపై స్పష్టత లేదు. అయితే కింగ్‌డమ్ సీక్వెల్‌పై చిత్ర బృందం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. విజయ్ దేవరకొండ – భాగ్యశ్రీ బోర్సే జంటగా తెరకెక్కిన చిత్రం ‘కింగ్‌డమ్’. ఈ సినిమాను సుమారుగా రూ.130 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తే కేవలం రూ.82 కోట్లు మాత్రమే వసూలు చేసిందని టాక్.
READ ALSO: Renting Husbands: ఈ దేశంలో అద్దెకు భర్తలు దొరుకుతారు.. ఎక్కడో తెలుసా!