Telangana Electricity Employees Strike: నేడు విద్యుత్ ఉద్యోగుల మహా ధర్నా.. పవర్ కట్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Electricity Employees Strike: రాష్ట్రవ్యాప్తంగా నేడు విద్యుత్ ఉద్యోగులు మహా ధర్నా చేయనున్నారు. కేంద్రం తెస్తున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ విద్యుత్ ఉద్యోగులందరూ విధులను బహిష్కరించనున్నట్లు టీఎస్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ ప్రకటించింది. నేడు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలిగినా.. పునరుద్ధరణ పనులు చేయకుండా నిరసన తెలుపుతామని హెచ్చరించింది. కానీ.. దానికి వినియోగదారులు సహకరించాలని విద్యుత్ ఉద్యోగులు కోరుతున్నారు. ఈనేపథ్యంలో.. పవర్ ఇంజనిర్స్ అసోసియేషన్, విద్యుత్ JAC ప్రతినిధులు మహా ధర్నా పోస్టర్ ను కూడా ఆవిష్కరించిన విషయం తెలిసిందే.. విద్యుత్ చట్ట సవరణ బిల్లును కేంద్రం ప్రవేశపెడితే..? పూర్తీగా విధులను బహిష్కరించి నిరవధికంగా సమ్మెకు దిగేందుకు సిద్ధమని ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు.
read also: Road Terror in Prakasam: కంభం సమీపంలో ఘోర ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- Congress Councillors: కాంగ్రెస్కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
- Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
- CM Revanth Reddy: మనకు ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు, నేరుగా చైనా, జపాన్తోనే పోటిపడుతున్నాం..
అయితే.. కేంద్ర ప్రభుత్వం తెస్తున్న ఈబిల్లుతో అనేక సమస్యలు వస్తాయని, అసలు విద్యుత్ రంగాన్నే కేంద్ర ప్రభుత్వం ప్రైవేటికరించేందుకు సిద్ధమవుతోందని ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే.. ప్రైవేట్ సంస్థలకు రూపాయి ఖర్చు లేకుండా అదే విద్యుత్ లైన్ నుండి సరఫరా చేసేలా ఈ బిల్లు ఉందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. దీంతో.. ఇప్పుడు కేంద్ర తీసుకొచ్చే కొత్త చట్టంతో వినియోగదారుల నుంచి అధిక చార్జీలు వసూలు చేయాల్సిన అవసరం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఈ సమ్మెలో దేశవ్యాప్తంగా 27 లక్షల మంది విద్యుత్తు ఉద్యోగులు పాల్గొంటారని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రకటించింది.
అయితే నిన్న (ఆదివారం) అర్ధరాత్రి 12 గంటల నుంచే విధులు బహిష్కరిస్తున్నట్టు తెలంగాణ విద్యుత్ ఇంజనీర్ల జేఏసీ చైర్మన్ కోడూరి ప్రకాశ్, కన్వీనర్ ఎన్.శివాజీ తెలిపారు. అయితే ఈ మహాధర్నాతో రాష్ట్రవ్యాప్తంగా కరెంట్ సరఫరా తీవ్ర అంతరాయాలు ఏర్పడి చీకట్లు కమ్ముకునే ప్రమాదం వుందని పరిశ్రమలపై తీవ్ర ప్రభా వం పడే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే చేస్తున్న ఈఉద్యమంలో విద్యుత్ సంస్థలను కాపాడుకునేందుకే కావున వినియోగదారులు తమకు సహకరించాలని సంఘాలు కోరుతున్నాయి
Weather Update: తీవ్ర అల్పపీడనం.. భారీవర్షాలకు అవకాశం
తాజావార్తలు
-
Abhishek Sharma: కొట్టింది 29 పరుగులే.. అయినా వరల్డ్ రికార్డ్ బద్దలుగొట్టిన కాటేరమ్మకొడుకు..
-
AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
-
India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
-
US: హిందూ దేవాలయంపై కాల్పులకు కుట్ర.. యువకుడు అరెస్ట్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!