రాజమండ్రిలో జనసేన-టీడీపీ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ మీటింగ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధ్యక్షతన జరుగుతుంది. సమావేశానికి జనసేన, టీడీపీ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు హాజరయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైలు ఎదురుగా ఉన్న మంజీరా హోటల్‌లో ఈ సమావేశం జరుగుతుంది. సీట్లు, ఓట్లు పక్కనబెట్టి పోరాటంపై దృష్టి పెట్టేందుకు ఈ భేటీ నిర్వహించారు.
Telangana Electricity Employees Strike: రాష్ట్రవ్యాప్తంగా నేడు విద్యుత్ ఉద్యోగులు మహా ధర్నా చేయనున్నారు. కేంద్రం తెస్తున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ విద్యుత్ ఉద్యోగులందరూ విధులను బహిష్కరించనున్నట్లు టీఎస్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ ప్రకటించింది. నేడు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలిగినా.. పునరుద్ధరణ పనులు చేయకుండా నిరసన తెలుపుతామని హెచ్చరించింది. కానీ.. దానికి వినియోగదారులు సహకరించాలని విద్యుత్ ఉద్యోగులు కోరుతున్నారు. ఈనేపథ్యంలో.. పవర్ ఇంజనిర్స్ అసోసియేషన్, విద్యుత్ JAC ప్రతినిధులు మహా ధర్నా…