Mahmood Ali: దేశంలోనే తెలంగాణ పోలీసులు నెంబర్ వన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahmood Ali: దేశంలోనే తెలంగాణ పొలీసులు నెంబర్ వన్ అని హోంమంత్రి మహమూద్ ఆలీ అన్నారు. ఉమెన్ సేఫ్టీ వింగ్, తెలంగాణ పోలీస్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నేషనల్ యూత్ డే సందర్భంగా C.A.P. సైబర్ అంబాసిడర్స్ ప్లాట్ ఫామ్ లాంచ్ కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్ ఆలీ, డీజీపీ అంజనికుమార్, పోలీస్ ఉన్నతాధికారులు, రోనాల్డ్ రోస్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సెక్రెటరీ,విద్యాశాఖ సెక్రెటరీ కరుణ, స్కూల్ స్టూడెంట్స్ పాల్గొన్నారు. సైబర్ అంబాసిడర్స్ ఫ్లాట్ ఫామ్ లోగోను హోంమంత్రి ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. దేశంలోనే తెలంగాణ పొలీసులు నెంబర్ వన్ అన్నారు. సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగి పోతున్నాయని, కరోనా టైం నుంచి సెల్ ఫోన్స్ ఎక్కువగా వాడుతున్నారని తెలిపారు. పోలీసులు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నారని అన్నారు. టెక్నాలజీ పెరిగింది.. దీంతో పాటు సైబర్ నేరాలు పెరిగాయన్నారు. ప్రజల కోసం పొలీసులు నిరంతరం పని చేస్తున్నారని తెలిపారు. స్కూల్స్ లో సైబర్ అంబాసిడర్స్ సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తారన్నారు. సైబర్ అంబాసిడర్స్ సైబర్ నేరాల నియంత్రణ కోసం పని చేస్తారని, సైబర్ అంబాసిడర్స్ కు సైబర్ కంట్రోల్ బాధ్యత ఉందని హోంమంత్రి తెలిపారు. ఉమెన్ సేఫ్టీ కోసం షీ టీమ్స్, భరోసా సెంటర్స్ పని చేస్తున్నాయని మహమూద్ అలీ తెలిపారు.
Read also: Rainbow Children’s Hospital: పిల్లలు పక్కతడుపుతున్నారా..? అయితే ఈ చికిత్స అవసరం
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్‌రావు సంచలన ఆరోపణలు
ఇక డీజీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా సైబర్ నేరాలు పెరుగుతున్నాయని తెలిపారు. పెట్రోల్ వెహికిల్స్ లాగా సైబర్ పెట్రోల్ వచ్చిందని అన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన ఉండాలన్నారు. సైబర్ సెక్యూరిటీ లో ముందు ఉండాలని తెలిపారు. సేఫ్టీ అంటే ఫిజికల్ నే కాకుండా.. డేటా,సెక్యూరిటీ ,సేఫ్టీ లో ముందు ఉండాలని తెలిపారు. రోనాల్డ్ రోస్.. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ సెక్రెటరీ విద్యాశాఖ సెక్రెటరీ కరుణ మాట్లాడుతూ.. సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని అన్నారు. రెసిడెన్షియల్ స్కూల్, ప్రభుత్వ స్కూల్ లో ఈ సైబర్ అంబాసిడర్స్ సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తామన్నారు. ప్రతి స్కూల్ నుంచి 4 గురిని సెలెక్ట్ చేసి సైబర్ నేరాలపై ట్రైనింగ్ ఇస్తామన్నారు. వాళ్లు ఆ స్కూల్స్ లో అందరికి సైబర్ నేరాలపై అవగాహన ల్పించి, అప్రమత్తం చేస్తారని తెలిపారు. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలు తగ్గేవిదంగా కృషి చేయాలన్నారు. 380 స్కూల్స్ లో సైబర్ అంబాసిడర్స్ ప్రారంభిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు.
Telangana CS: తెలంగాణ నెక్ట్స్ సీఎస్ ఎవరు?.. రేసులో ఆ నలుగురు ?
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!