Rainbow Children’s Hospital doctor advise on how to control Bedwetting in Kids: బెడ్ వెట్టింగ్ (పక్క తడుపుట) అనేది పిల్లల బాల్యంలో సాధారణంగా జరుగుతుంది. అయితే కొన్నిసార్లు పిల్లలు ప్రతీరోజు పక్కతుడుపుతుండటం తల్లిదండ్రులకు ఇబ్బందికరంగా మారుతుంది. పిల్లలు నిద్రపోయినప్పుడు వారికి తెలియకుండానే పక్కతడుపుతుంటారు. ఇది పిల్లల తప్పు కాదు. ఇలా పక్కతడపడాన్ని ‘‘నోర్టూర్నరల్ ఎనురెసిస్’’ అని పిలుస్తారు. బిడ్డ ఎప్పడూ పక్కతడుపుతుంటే దీన్ని ‘ఫ్రైమరీ నోక్టూర్నల్ ఎనురెసిస్’’ అంటారు. 6 నెలల తర్వాత అంతకంటే ఎక్కువ కాలం ఈ సమస్య ఉంటే దాన్ని ‘‘సెకండరీ నోక్టూర్నల్ ఎనురెసిస్’’ అంటారు.
పక్కతడపడానికి కారణాలు:
బెడ్ వెట్టింగ్ అత్యంత తరచుగా గాఢ నిద్రవల్ల కలుగుతుంది. గాఢనిద్రలో మూత్రాశయం నిండి ఉన్నా పిల్లలు మేల్కొనరు. దీంతో బెడ్ లోనే మూత్రవిసర్జన చేస్తారు. కొంతమంది పిల్లల మూత్రాశయాలు చిన్నవిగా ఉంటాయి. లేద రాత్రివేళ్లలో మూత్రం ఎక్కువగా ఉత్పత్తి చేయడం కూడా ఇందుకు ఓ కారణం. కొన్ని సందర్భాల్లో మలబద్ధకం కూడా పక్కతడపడానికి కారణం అవుతుంది. పేగు మూత్రాశయాన్ని నొక్కడం వల్ల బెడ్ వెట్టింగ్ కలుగుతుంది.
వారసత్వంగా వస్తుందా..?
పక్కతడపటం అనేది వారసత్వంగా వచ్చే అవకాశం ఉంది. తల్లిదండ్రుల్లో ఎవరైనా చిన్నప్పుడు పక్కతడిపే అలవాటు ఉంటే పిల్లల్లో 30 శాతం వచ్చే అవకాశం ఉంది. తల్లిదండ్రులిద్దరికి చిన్నతనంలో పక్కతడిపే అలవాటు ఉంటే ఇది పిల్లల్లో వచ్చే ఛాన్స్ 50 శాతం పెరుగుతుంది. అయితే అత్యధిక మంది పిల్లలకు ఈ అలవాటు కొంతకాలానికి దానంతట అదే తగ్గిపోతుంది.
• 5 సంవత్సరాల వయస్సు వచ్చే సరికి, 15% మంది పిల్లలు పక్క తడుపుతారు.
• 10 సంవత్సరాల వయస్సు వచ్చే సరికి, 5% మంది పిల్లలు పక్క తడుపుతారు.
• 15 సంవత్సరాల వయస్సు వచ్చే సరికి, 2% మంది పిల్లలు పక్క తడుపుతారు.
ఈ కింది వాటిల్లో ఒకటి లేదా ఎక్కువ వాటి వల్ల బెడ్‌వెట్టింగ్ కలుగుతుంది:
• మూత్రాశయంన్ని ఖాళీ చేసేందుకు నిద్ర నుంచి సిగ్నల్‌కి మేల్కొనలేకపోవడం
• హార్మోన్ వాసోప్రెస్సిన్ లేకపోవడం
• ఓవర్‌యాక్టివ్ మూత్రాశయం
• మలబద్ధకం
• మూత్ర మార్గం ఇన్ఫెక్షన్ (యుటిఐ)
• ఆతృత మరియు ఒత్తిడి
• చిన్న మూత్రాశయం సైజు
చికిత్స:
పక్కతడపడాన్ని పరిష్కరించేందుకు చికిత్స అందుబాటులో ఉంది. ఏడు సంవత్సరాలు దాటిన తర్వాత రెగ్యులర్ గా బెడ్ వెట్టింగ్ కొనసాగితే చికిత్స చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. బిడ్డకు తగినంత అవగాహన కల్పించడం, చికిత్స చేయించుకునేలా తల్లిదండ్రులు ప్రేరణ కలిగించడం, అవగాహన, మద్దతు చాలా ముఖ్యం.
బెడ్ వెట్టింగ్ అలారమ్స్:
నిద్రపోతున్నప్పుడు మూత్రాశయం నిండుగా ఉందనే అనుభూతిని బిడ్డ గుర్తించడానికి, టాయిలెట్‌కి వెళ్ళడానికి లేదా నిలుపుకోవడం నేర్చుకోవడానికి బెడ్ వెట్టింగ్ అలారమ్స్ సహాయపడతాయి. పక్క తడపకపోవడానికి బిడ్డ సిద్ధంగా ఉంటే మరియు సమస్యను పరిష్కరించడంలో నిమగ్నమైతే బెడ్ వెట్టింగ్‌ని పరిష్కరించడానికి బెడ్ వెట్టింగ్ అలారమ్స్ చాలా విజయవంతంగా పనిచేస్తాయి.
మందులు:
రాత్రివేళల్లో పిల్లలకు బెడ్ వెట్టింగ్ జరగకుండా ఉండేందుకు మామూలుగా రెండు రకాల మందులు ప్రిస్క్రయిబ్ చేస్తారు. సహజ హార్మోన్ వాసోప్రెస్సిన్ కృత్రిమ రూపమైన డెస్మోప్రెస్సిన్, రాత్రి సమయంలో మూత్రపిండాలు తక్కువ మూత్రం తయారుచేయడానికి సహాయపడతాయి. ఆక్సిబుటినిన్ లాంటి కండరాల సడలింపులు మూత్రాశయం రిలాక్స్ కావడానికి మరియు మూత్రాన్ని నింపుకునేలా చేయడానికి సహాయపడతాయి. అప్పుడప్పుడు, ఒకేసారి ఉపయోగించేందుకు రెండు మందులు ప్రిస్క్రయిబ్ చేయబడతాయి.
మూత్రాశయం శిక్షణ
పగలు మరియు రాత్రి బెడ్ వెట్టింగ్ సమస్య ఉన్న కొంత మంది పిల్లలు మూత్రాశయం శిక్షణ ప్రోగ్రామ్ నుంచి ప్రయోజనం పొందవచ్చు. మూత్రాశయం శిక్షణ బిడ్డకు సహాయపడవచ్చా అనే విషయం వ్యక్తిగత అంశాలు సాధారణంగా నిర్ణయిస్తాయి. మూత్రాశయం శిక్షణలో సాధారణంగా రెగ్యులర్‌గా టాయిలెట్‌గా వెళ్ళే దినచర్యను అలవరచుకోవడం ఉంటుంది. తరచుగా గంట విరామంతో టాయిలెట్‌కి వెళ్ళడంతో ప్రారంభమవుతుంది మరియు ఆ తరువాత దీనిని ప్రతి రెండు గంటలకు ఒకసారి చేసుకోవడంగా మారుతుంది.
రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో మా అనుభవం
గత 8 సంవత్సరాలో 7 నుంచి 10 సంవత్సరాల వయస్సుగల దాదాపు 1200 మంది పిల్లలు బెడ్ వెట్టింగ్‌తో మా వద్దకు వచ్చారు. వీరిలో 636 మంది (53%) పురుషులు మరియు 564 (47%) మంది అమ్మాయిలు ఉన్నారు. 70% మందికి మందుల అవసరం కలగలేదు, వీళ్ళకు భరోసా మరియు మోటివేషన్ థెరపి మాత్రమే అవసరమైంది. 10 నుంచి 15 సంవత్సరాల వయస్సుగల 2450 మంది పిల్లలు బెడ్ వెట్టింగ్‌తో మా వద్దకు వచ్చారు. వీరిలో 56% మంది (1372) అబ్బాయిలు మరియు 44% (1078) మంది అమ్మాయిలు ఉన్నారు. 90% మందికి ఆతృత మరియు ఒత్తిడి వల్ల మందులు అవసరమయ్యాయి.
డా. వి వి ఆర్ సత్య ప్రసాద్
ఎండి (Peds), పీడియాట్రిక్ నెఫ్రాలజీలో ఫెలోషిప్
(ఎయిమ్స్, న్యూఢిల్లీ), (ఎన్యుహెచ్, సింగపూర్)
సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిక్ నెఫ్రాలజిస్టు
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్, బంజారా హిల్స్
మొబైల్ నెంబర్: 8882 046 046