Golconda Bonalu: సంబరాలు షురూ. బోనమెత్తిన గోల్కొండ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నగరానికి ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. నగరానికి ఆషాఢ మాసం రాకతో బోనాల సందడి షురూ అయ్యింది. నేడు గోల్కొండ కోట బోనమెత్తింది. బంగారు బోనానికి లంగర్ హౌజ్ లో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ దీపం వెలిగించి పూజలు నిర్వహించారు. తొట్టెలకు స్వాగతం పలికి.. శ్రీ జగదాంబిక అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువ్రస్తాలు సమర్పించారు. అనంతరం తలసాని మాట్లాడుతూ.. వందల ఏళ్లుగా బోనాల జాతర జరుగుతోందని, ప్రతి ఆలయానికి ఆర్ధిక సాయం అందించిన ఘనత తెలంగాణదేనన్నారు.
జూలై 17, 18న సికింద్రాబాద్ లో బోనాలు నిర్వహిస్తామన్నారు. జూలై 24, 25న లాల్ దర్వాజ బోనాలు జరుగుతాయన్నారు. తెలంగాణ బోనాలు మన సంస్కృతికి అద్దం పడతాయని, కుల మతాలకు అతీతంగా బోనాలు నిర్వహిస్తామన్నారు. జూలై 10 వ తేదీన బోనాలు, బక్రీద్ వేడుకలు జరపనున్నట్టు వెల్లడించారు. అందరూ కలిసి అన్ని పండుగలు చేసుకోవాలని తలసాని సూచించారు. అనంతరం హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ బోనాలకు పెద్ద పీట వేశారని తెలిపారు. తెలంగాణలో వైభవంగా బోనాల పండుగ నిర్వహిస్తున్నామన్నారు. మన సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీక బోనాలు అని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీ అన్నారు. బోనాల పండగను అందరం సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ బోనాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ రూ.15 కోట్లు కేటాయించారన్నారు. తెలంగాణ సీఎం ఆదేశాల మేరకు బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా జీవించేలా అమ్మవారి ఆశీస్సులు కలకాలం కొనసాగాలని ప్రార్థించామన్నారు.
Also Read
తాజావార్తలు
-
MG Hector Blackstorm: MG హెక్టర్ బ్లాక్‌స్టార్మ్, స్నోస్టార్మ్ ఎడిషన్స్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
-
Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!