CM Revanth Reddy: ఉదయం గాంధీభవన్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నుంచి సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో భేటీ వరకు సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ అంతా బిజీబిజీగా గడపనున్నారు.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి వేడుకలకు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సీఎస్ ఆదేశించారు.
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి బుధవారం గోల్కొండ కోటలో నూతన లైట్ అండ్ సౌండ్ షోను ప్రారంభించనున్నారు. కోటలో ముఖద్వారం ఇల్యూమినేషన్‌ను కూడా ఆయన ప్రారంభించనున్నారు. మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, గోల్కొండ కోటలో సౌకర్యాలను మెరుగుపరచడంలో మరియు పర్యాటక అనుభవాన్ని మెరుగుపరచడంలో భాగంగా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ రెండు ప్రాజెక్టులను చేపట్టింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మాజీ మంత్రి, నటుడు చిరంజీవి, ప్రముఖ రచయిత, రాజ్యసభ సభ్యుడు…
నగరానికి ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. నగరానికి ఆషాఢ మాసం రాకతో బోనాల సందడి షురూ అయ్యింది. నేడు గోల్కొండ కోట బోనమెత్తింది. బంగారు బోనానికి లంగర్ హౌజ్ లో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ దీపం వెలిగించి పూజలు నిర్వహించారు. తొట్టెలకు స్వాగతం పలికి.. శ్రీ జగదాంబిక అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువ్రస్తాలు సమర్పించారు. అనంతరం తలసాని మాట్లాడుతూ.. వందల ఏళ్లుగా బోనాల జాతర జరుగుతోందని, ప్రతి ఆలయానికి ఆర్ధిక…
నగరానికి ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. నగరానికి ఆషాఢ మాసం రాకతో బోనాల సందడి మొదలవుతుంది. బోనాల ఉత్సవాలతో నగరంలో బస్తీలు, కాలనీలు కళకళలాడుతాయి. భక్తులు తమ ఇష్టదైవానికి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. హైదరాబాద్ లో తొలి బోనం గురువారం చారిత్రక గోల్కొండ కోటలో కొలువైన జగదాంబిక ఎల్లమ్మ అమ్మవారికి సమర్పణతో ఉత్సవాలు మొదలవుతాయి. ఇవాల్టి నుంచి వచ్చేనెల 28వ తేదీ వరకు తొమ్మిదివారాల (గురు,ఆదివారాలు)పాటు ఆషాఢమాస బోనాలను చారిత్రక గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో దేవాదాయ…
హైదరాబాద్ లో ఒక వైపు గంజాయి, డ్రగ్స్ మరోవైపు నకిలీ కరెన్సీ కలకలం రేపుతోంది. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కోట్ల నకిలీ కరెన్సీ పట్టుకున్నారు. ఈ కేసుకి సంబంధించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుల వద్ద ఉన్న బ్యాగులో 500, 2000 నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో ఎస్ ఐ దాస్, లక్ష్మీ నారాయణలతో కలిసి పట్టుకున్నారు గోల్కొండ ఇన్ స్పెక్టర్ సముద్ర శేఖర్. 7 టూంబ్స్ బస్…
ఈఏడాది కూడా స్వాతంత్ర్యదినోత్సవాన్ని గోల్కొండ కోటలోనే నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం.. ఈ నెల 15 వ తేది ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని తెలిపారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్… ఇవాళ బీఆర్కే భవన్‌లో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించిన సీఎస్.. స్వాతంత్ర్యదినోత్సవం కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు.. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ…