కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ విడుదల చేసిన వరంగల్ డిక్లరేషన్‌పై టీఆర్ఎస్ నేత, తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అధికారంలోకి వస్తే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్తున్న కాంగ్రెస్.. ప్రస్తుతం అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రైతు రుణమాఫీని అమలు చేస్తున్నదా? అని రాహుల్‌గాంధీని మంత్రి నిరంజన్ రెడ్డి నిలదీశారు. రాహుల్ గాంధీ డిక్లరేషన్ పై మంత్రి మీడియాతో మాట్లాడారు. తెరాసను క్షమించం అనేందుకు రాహుల్ ఎవరని ప్రశ్నించారు. మిమ్మల్ని ఆల్రెడీ ప్రజలు శిక్షంచారు.. మీరు మిమ్మల్ని అనేది ఏందని నిలదీశారు. ఇవాళ ప్రజల అవసరాలకు సంబంధించి మేము అన్ని చేస్తున్నామన్నారు మంత్రి.
Read Also: Somireddy: చంద్రబాబు సీఎం అయితేనే ఏపీ పునర్నిర్మాణం
రైతు బంధు ప్రపంచంలో ఎవరికి ఆలోచన రాలేదు… మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయ్యొచ్చు కదా? అని ప్రశ్నించారు. 2015లో తిరస్కరించిన అంశాలు మళ్ళీ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ అసలు ఎందుకు వచ్చారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల పట్ల వారికి ఏ మాత్రం అవగాహన లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన 60ఏళ్ల అన్యాయలను తెరాస ఎదరించి నిలించిందన్నా మంత్రి. కోట్లాది మంది సాధించిన తెలంగాణ రాష్ట్రం ఇది… మేము బలిదానాలతో సాదించుకున్నది, మీరు ఇచ్చింది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని అమ్మనా భూతులు తిట్టిన వారే… ఇప్పుడు సారథులయ్యారా? ఇది మీ దుస్థితి అంటూ ఎద్దేవా చేశారు.
ప్రజలు ఏ ఎన్నికలు అయిన సరే మిమ్మల్ని తిరస్కరిస్తున్నారని మీకు తెలియడం లేదా అన్నారు. మీ చేతగాని తనం వల్ల దేశంలో విద్వేషం పెరిగిపోయిందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. కేవలం ఒక్క రోజు పార్లమెంట్ లో మాట్లాడటం కాదు, నిరంతర కార్యాచరణ ఏమైందని ప్రశ్నించారు. ఎప్పుడు చూసినా స్వాతంత్రం తెచ్చాం అని చెప్పుకోవడం కాదు! మీరు కాదు స్వాతంత్య్రం తెచ్చింది, స్వాతంత్ర ఉద్యమంలో మీ పాత్ర ఉంది, కానీ.. మొత్తం పాత్ర మీది కాదని పునరుద్ఘాటించారు. A.O హ్యూమ్ చేతిలో పుట్టిన పార్టీ ఇది, మీరు పెట్టింది కాదని గుర్తు చేశారు. కాంగ్రెస్ కళ్లబొల్లి మాటలను ఎవరూ నమ్మరని చెప్పారు. కాంగ్రెస్ వరంగల్ సభ అట్టర్‌ప్లాప్ అయ్యిందన్న మంత్రి.. టీఆర్‌ఎస్ కార్యకర్తల స్థాయిలో కూడా ఆ సభ లేదన్నారు.