72 హెచ్‌పీ పవర్, AMT గేర్‌బాక్స్.. ఫిబ్రవరి 17న Nissan Gravite MPV లాంచ్
- నిస్సాన్ ఇండియా తమ కొత్త గ్రావైట్ MPV..
- ఫిబ్రవరి 17వ తేదీన భారత మార్కెట్‌లో విడుదల..
- కొత్త డిజైన్, 7-సీటర్ ఆప్షన్, 1.0 లీటర్ ఇంజిన్‌తో నిస్సాన్ గ్రావైట్ MPV
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nissan Gravite MPV: నిస్సాన్ ఇండియా తమ కొత్త గ్రావైట్ MPV (Nissan Gravite MPV)ను భారత మార్కెట్‌లో ఫిబ్రవరి 17వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. వాస్తవానికి ఈ మోడల్‌ను జనవరి 21న లాంచ్ చేయాల్సి ఉండగా, కారణాలు వెల్లడించకుండా కంపెనీ ఈ ఈవెంట్‌ను వాయిదా వేసింది. ఇదే తరహాలో నిస్సాన్ కొత్త మిడ్-సైజ్ SUV టెక్టన్ (Tekton) లాంచ్ కూడా వాయిదా పడింది. టెక్టన్‌ను ఈరోజే ఆవిష్కరించాల్సి ఉండగా, అది కూడా ఆలస్యం అయింది.
Read Also: Redmi Note 15 Pro+, Note 15 Pro సేల్స్ ప్రారంభం.. ఆఫర్స్.. ఫీచర్స్..
Also Read
- TVS Jupiter: ఫ్యామిలీ స్కూటర్లలో TVS Jupiter హవా.. 31 రోజుల్లో 1.47 లక్షల యూనిట్ల అమ్మకాలు!.. ఎందుకు ఇంత డిమాండ్?
- రూ.5.49 లక్షలకే Tata Aeris.. 6 ఎయిర్‌బ్యాగ్స్, అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్లతో బెస్ట్ ఫ్యామిలీ కారు విడుదల!
- Renault Rafale Hypnotic: రెనాల్ట్ రఫేల్ హిప్నోటిక్ లాంచ్.. 300hp పవర్, 1,000KM రేంజ్‌తో అదిరిపోయే SUV
- Nissan Pixo: నిస్సాన్ పిక్సో విడుదల.. 259KM రేంజ్, 10-అంగుళాల డిస్‌ప్లే, Gemini వాయిస్ అసిస్టెంట్.. ఫీచర్లు ఇవే
కొత్త మోడళ్లతో లైనప్:
గ్రావైట్ MPVతో నిస్సాన్ భారత మార్కెట్‌లో తన ప్రొడక్ట్ లైనప్‌ను విస్తరించాలనుకుంటోంది. గ్రావైట్ తర్వాత కొద్ది నెలల వ్యవధిలోనే టెక్టన్ SUVని లాంచ్ చేయనుంది. అలాగే, 2027లో ఒక కొత్త 7-సీటర్ SUVను కూడా తీసుకురావాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఇప్పటి వరకు నిస్సాన్ భారత మార్కెట్‌లో ప్రధానంగా మ్యాగ్నైట్ (Magnite) మోడల్ ద్వారానే పాపులర్ అయింది.
డిజైన్ హైలైట్స్:
గ్రావైట్ పూర్తి డిజైన్ ఇంకా బయటకు రాలేదు.. అయినప్పటికీ, నిస్సాన్ విడుదల చేసిన టీజర్ చిత్రాలు వాహనానికి కొత్త లుక్ ఇచ్చినట్లు కనిపిస్తుంది. ముందుభాగంలో కొత్త గ్రిల్, నిస్సాన్ లోగో, క్రోమ్ అక్సెంట్స్ ప్రధాన ఆకర్షణగా కనిపిస్తున్నాయి. అలాగే, కొత్త హెడ్‌ల్యాంప్ డిజైన్‌తో పాటు బోనెట్‌పై హుడ్ స్కూప్‌లా కనిపించే ఎలిమెంట్ వాహనానికి రగ్డ్ లుక్‌ను ఇస్తోంది.
Read Also: Varanasi Update: ‘అవతార్’తో పోల్చొద్దు.. జేమ్స్ కామెరూన్‌పై రాజమౌళి రియాక్షన్!
ఇంటీరియర్ & సీటింగ్:
అయితే, నిస్సాన్ గ్రావైట్‌లో డ్యాష్‌బోర్డ్‌లో కొత్త మెటీరియల్స్‌తో ఫ్రెష్ డిజైన్ ఉండే అవకాశం ఉంది. రెనాల్ట్ ట్రైబర్ (Triber)తో కొన్ని ఫీచర్లను పంచుకునే ఛాన్స్ ఉంది. అలాగే, మూడు వరుసల సీటింగ్ లేఅవుట్ తో రాబోతుంది. 5, 6 లేదా 7 సీటింగ్ కాన్ఫిగరేషన్‌లను అందించేలా ప్లాన్ చేస్తున్నారు.
ఫీచర్లు:
* 7-ఇంచ్ TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
* 8-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
* Android Auto & Apple CarPlay సపోర్ట్
* వైర్‌లెస్ ఛార్జింగ్
* సెంటర్ కన్సోల్‌లో కూల్డ్ స్టోరేజ్
* సెకండ్ రో సీట్లకు స్లైడ్ & రిక్లైన్ ఫంక్షన్
ఇంజిన్:
గ్రావైట్ MPVలో 1.0 లీటర్, 3-సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉండే అవకాశం ఉంది. ఇది సుమారు 72 హెచ్‌పీ పవర్, 96 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కు 5-స్పీడ్ మాన్యువల్ లేదా AMT గేర్‌బాక్స్ ఆప్షన్లు అందించనున్నారు. ఇది ట్రైబర్‌లో ఉన్న సెటప్‌కు సమానంగా ఉండే అవకాశం ఉంది. డ్రైవబిలిటీ మెరుగుపర్చేందుకు నిస్సాన్ కొన్ని మార్పులు చేయవచ్చని సమాచారం.
తాజావార్తలు
-
TVS Jupiter: ఫ్యామిలీ స్కూటర్లలో TVS Jupiter హవా.. 31 రోజుల్లో 1.47 లక్షల యూనిట్ల అమ్మకాలు!.. ఎందుకు ఇంత డిమాండ్?
-
Indian Ocean: హిందూ మహాసముద్రంపై యుద్ధమేఘాలు..నెక్ట్స్ ఏం జరగనుంది?
-
Iran Ceasefire Proposal: ఇరాన్ శాంతి ప్రతిపాదనకు ట్రంప్ నో.. 7 రోజుల కాల్పుల విరమణ ప్లాన్ తిరస్కరణ
-
Shubman Gill Injury: సిరాజ్ దెబ్బకు శుభ్‌మన్ గిల్ విలవిలా.. నెట్స్ లో గాయపడ్డ టీమిండియా కెప్టెన్.!
-
Vikarabad: గణేష్ నిమజ్జనంలో కలకలం.. పోలీస్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి..!
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!