Health Tip: వీటిని ఫ్రిజ్‌లో నిల్వ చేసి తింటున్నారా? జాగ్రత్త సుమీ!
- పెద్దమొత్తంలో కొనుగోలు చేసి వాటిని ఫ్రిజ్‌లో నిల్వ చేయడం అంత ఉత్తమం కాదు.
- ఇలా పెద్దమొత్తంలో నిల్వ చేయడం ఆరోగ్యానికి హానికరం.
- టొమాటో, దోసకాయ, వెల్లుల్లి, ఉల్లిపాయ, బంగాళదుంపలను గది ఉష్ణోగ్రతలో నిల్వ చేయడం ఉత్తమం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Health Tip: నేటి హడావిడి, బిజీ జీవనశైలి కారణంగా చాలా మంది వంటకు తక్కువ సమయం కేటాయించగలుగుతున్నారు. ముఖ్యంగా, వర్కింగ్ కపుల్స్ వారాంతాల్లో కూరగాయలను పెద్దమొత్తంలో కొనుగోలు చేసి వాటిని ఫ్రిజ్‌లో నిల్వ చేస్తూ ఉంటారు. రిఫ్రిజిరేటర్‌లో ఆహార పదార్థాలను ఉంచడం వాటి తాజాదనాన్ని కాపాడుతుందని చాలామందికి నమ్మకం. అయితే, అన్ని కూరగాయలు ఫ్రిజ్‌లో నిల్వ చేయడానికి అనుకూలంగా ఉండవు. కొన్ని కూరగాయలను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల అవి త్వరగా పాడవడం, రుచి మారిపోవడం, పోషకాలు తగ్గిపోవడం జరుగుతుంది. కాబట్టి ఫ్రిజ్‌లో ఉంచకూడని ముఖ్యమైన కూరగాయలు గురించి తెలుసుకుందాం.
Also Read: Mahakumbh 2025 : మహా కుంభమేళా ప్రాంతంలో వాహనాల ప్రవేశం పై నిషేధం.. వీవీఐపీ పాసులు రద్దు
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
వెల్లుల్లి:
వెల్లుల్లిని ఫ్రిజ్‌లో ఉంచితే అది మొలకెత్తడం ప్రారంభిస్తుంది. మొలకెత్తిన వెల్లుల్లి రబ్బరు ఆకృతిని పొంది దాని రుచి చేదుగా మారుతుంది. పైగా పోషక విలువలు తగ్గిపోతాయి. కాబట్టి, వెల్లుల్లిని పొడి ప్రదేశంలో నిల్వ చేయడం ఉత్తమం.
ఉల్లిపాయ:
ఉల్లిపాయలను తేమగా, చల్లగా ఉండే ప్రదేశంలో ఉంచితే స్టార్చ్ చక్కెరగా మారిపోతుంది. ఫలితంగా ఉల్లిపాయలు త్వరగా కుళ్లిపోతాయి. అంతేకాకుండా, రిఫ్రిజిరేటర్ ఉష్ణోగ్రత వల్ల ఉల్లిపాయల ఎంజైమ్‌లు చర్య జరిపి చేదు రుచిని కలిగిస్తాయి. కాబట్టి ఉల్లిపాయలను బహిరంగానే నిల్వ చేయడం ఉత్తమం.
బంగాళదుంప:
బంగాళదుంపలను ఫ్రిజ్‌లో ఉంచితే స్టార్చ్ చక్కెరగా మారిపోతుంది. ఇది యాక్రిలామైడ్ అనే హానికరమైన రసాయనాన్ని ఉత్పత్తి చేయడానికి కారణమవుతుంది. పరిశోధనల ప్రకారం, ఈ రసాయనం అధిక మొత్తంలో తీసుకుంటే క్యాన్సర్ ముప్పు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి బంగాళదుంపలను చల్లని, పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి.
Also Read: Surya: నా తండ్రిని చూసి గర్వపడుతున్నా అంటూ సూర్య ఎమోషనల్
టొమాటో:
టొమాటోలను ఫ్రిజ్‌లో ఉంచితే అవి గట్టిగా మారి లోపలి పొర విరిగిపోతుంది. ఫలితంగా టొమాటో మెత్తగా మారి త్వరగా పాడవుతుంది. అంతేకాకుండా, టొమాటో పండిన తర్వాత ఇథిలిన్ వాయువు విడుదల చేస్తుంది. ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల ఈ వాయువు ఉత్పత్తి తగ్గి టొమాటో రుచిని మారుస్తుంది. కాబట్టి టొమాటోలను గది ఉష్ణోగ్రతలోనే ఉంచడం ఉత్తమం.
దోసకాయ:
దోసకాయను ఫ్రిజ్‌లో ఉంచితే అందులోని నీరు ఎండిపోయి రుచి చేదుగా మారుతుంది. పైగా దీని పోషకాలు తగ్గిపోతాయి. కాబట్టి దోసకాయను చల్లని, గాలితాగే ప్రదేశంలో ఉంచడం ఉత్తమం.
మొత్తంగా అన్ని కూరగాయలను ఫ్రిజ్‌లో నిల్వ చేయడం సరైన పద్ధతి కాదు. కొన్ని కూరగాయలను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల అవి త్వరగా పాడవచ్చు. అలాగే పోషకాలు తగ్గిపోవచ్చు, రుచి మారిపోవచ్చు. టొమాటో, దోసకాయ, వెల్లుల్లి, ఉల్లిపాయ, బంగాళదుంపలను ఫ్రిజ్‌లో ఉంచకుండా గది ఉష్ణోగ్రతలో నిల్వ చేయడం ఉత్తమం. ఈ చిన్న మార్పులు మీ ఆహారాన్ని తాజాగా ఉంచడమే కాకుండా, ఆరోగ్యానికి కూడా మేలును చేస్తాయి.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!