IPS Transfers: తెలంగాణలో 26 మంది IPSల బదిలీ.. ఎవరికి ఏ పోస్టింగ్.?
- తెలంగాణలో 26 మంది IPS అధికారుల బదిలీ
- వరంగల్ కొత్త సీపీగా ఎన్. శ్వేత నియామకం
- జోనల్ డీఐజీలకు అదనపు బాధ్యతలు
- సీఐడీ, ఇంటెలిజెన్స్‌లో కీలక పోస్టింగ్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPS Transfers: తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో భారీగా ఐపీఎస్ (IPS) అధికారుల బదిలీలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 26 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. శాంతిభద్రతల పరిరక్షణ, పరిపాలనా సౌలభ్యం కోసం పలువురు కీలక అధికారులకు స్థానచలనం కల్పించడంతో పాటు మరికొందరికి అదనపు బాధ్యతలను కూడా అప్పగించింది.
వరంగల్ కొత్త సీపీగా ఎన్. శ్వేత.. సున్‌ప్రీత్ సింగ్ బదిలీ
హైదరాబాద్ సిటీ నార్త్ రేంజ్ జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఎన్. శ్వేత, వరంగల్ పోలీస్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. దీనితో పాటు ఆమెకు మల్టీజోన్ పరిధిలోని డీఐజీ (జోన్-4, భద్రాద్రి) పూర్తి అదనపు బాధ్యతలను (FAC) అప్పగించారు. ఇప్పటివరకు వరంగల్ సీపీగా ఉన్న సున్‌ప్రీత్ సింగ్‌ను సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌గా నియమించారు. ఆయనకు అదనంగా డీఐజీ (జోన్-3, రాజన్న) బాధ్యతలను కూడా కేటాయించారు. అలాగే హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ ఎస్.ఎం. విజయ్ కుమార్‌కు హైదరాబాద్ నార్త్ రేంజ్ (లా అండ్ ఆర్డర్) జాయింట్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు దక్కాయి.
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
జోనల్ డీఐజీలుగా కీలక అధికారులకు అదనపు బాధ్యతలు
రామగుండం పోలీస్ కమిషనర్‌గా ఉన్న అంబర్ కిశోర్ ఝాకు అదనంగా డీఐజీ (జోన్-1, కాళేశ్వరం) బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ డి. జోయెల్ డేవిస్ డీఐజీ (జోన్-5, యాదాద్రి)గా, ఇంటెలిజెన్స్ సీఐ సెల్ డీఐజీ ఆర్. భాస్కరన్ డీఐజీ (జోన్-2, బాసర)గా పూర్తి అదనపు బాధ్యతలను నిర్వహించనున్నారు.
సీఐడీ, ఇంటెలిజెన్స్ విభాగాల్లో నియామకాలు
తెలంగాణ ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌గా ఉన్న చి. సింధు శర్మ హైదరాబాద్ ఇంటెలిజెన్స్ సీఐ సెల్ ఎస్పీగా బదిలీ అయ్యారు. అంతేకాకుండా ఎస్పీ (ఎస్ఐబీ)గా కూడా అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. ఎస్ఐబీ ఎస్పీగా ఉన్న వై. సాయి శేఖర్ సికింద్రాబాద్ రైల్వే పోలీస్ సూపరింటెండెంట్‌గా నియమితులయ్యారు. హైదరాబాద్ సిటీ డీసీపీగా ఉన్న చెర్నూరి రూపేష్, ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌గా ఉన్న చి. ప్రవీణ్ కుమార్‌లు సీఐడీ ఎస్పీలుగా బదిలీ అయ్యారు. పోస్టింగ్ కోసం వేచి చూస్తున్న ఆర్. వెంకటేశ్వర్లును హైదరాబాద్ సిటీ సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్ డీసీపీగా నియమించగా, గతంలో ఆయనను సీఐడీ ఎస్పీగా నియమించిన ఉత్తర్వులను రద్దు చేశారు. ఇక వనపర్తి అదనపు ఎస్పీగా ఉన్న రాజేష్ మీనాను వికారాబాద్ అదనపు ఎస్పీ (అడ్మిన్)గా బదిలీ చేయగా, అక్కడ పనిచేస్తున్న బి. రాములు నాయక్‌ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!