Ration Card eKYC: మీరు ఈకేవైసీ పూర్తి చేశారా..? స్టేటస్‌ను సింపుల్‌గా తెలుసుకోండిలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఉచిత రేషన్ బియ్యం పొందుతున్న లబ్ధిదారులకు ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను తప్పనిసరి చేశారు. పంపిణీ వ్యవస్థలో పారదర్శకత పెంచడం, అర్హులైన వారికి మాత్రమే సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 31 నాటికి రేషన్ కార్డులోని సభ్యులందరూ ఈ-కేవైసీని పూర్తి చేయాల్సి ఉంటుంది. గడువులోగా ఈ ప్రక్రియ ముగించకపోతే కార్డు నుంచి సభ్యుల పేర్లు తొలగించే అవకాశం ఉంది. దీనివల్ల ఉచిత రేషన్‌తో పాటు రేషన్ కార్డు ఆధారంగా వచ్చే ఇతర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను కూడా కోల్పోవాల్సి వస్తుంది.
లబ్ధిదారులు తమ ఈ-కేవైసీ పూర్తయిందో లేదో తెలుసుకోవడానికి ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేదు. స్మార్ట్‌ఫోన్ ద్వారానే సులభంగా స్టేటస్ పరిశీలించుకోవచ్చు. ముందుగా అధికారిక ‘స్మార్ట్ పీడీఎస్’ (smartpds.telangana.gov.in) పోర్టల్‌ను సందర్శించి, బెనిఫిషియరీ డీటైల్స్ విభాగంలో రేషన్ కార్డ్ నంబర్, క్యాప్చా నమోదు చేయాలి. అక్కడ వివరాలలో స్టేటస్ ‘యాక్టివ్’ అని ఉంటే కేవైసీ పూర్తయినట్లు కాదు. దాంతో పాటు.. లాస్ట్ ఆప్షన్ లో ఉన్న వెరిఫికేషన్ స్టేటస్ దగ్గర కచ్చితంగా వెరిఫైడ్ అని ఉండాలి లేదంటే మీ కేవైసీ పూర్తి కానట్లే.
Also Read
- 2027 World Cup: ప్రపంచ కప్‌లో ఆడే టాప్ 6 ఆటగాళ్లు వీరే.. ఆకాశ్ చోప్రా అంచనా ఇలా..
- ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
ఒకవేళ కేవైసీ నాట్ వెరిఫైడ్ లో ఉంటే, వెంటనే స్థానిక రేషన్ దుకాణానికి వెళ్లి ఈ-పోస్ యంత్రంలో బయోమెట్రిక్ వేలిముద్రలు లేదా ఐరిస్ స్కాన్ ద్వారా పూర్తి చేసుకోవచ్చు. మీసేవా కేంద్రాలలో కూడా ఈ సదుపాయం అందుబాటులో ఉంది. ఈ నమోదు ప్రక్రియ పూర్తిగా ఉచితం కాబట్టి లబ్ధిదారులు రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. దీని కోసం రేషన్ కార్డుతో పాటు సభ్యుల ఒరిజినల్ ఆధార్ కార్డులను వెంట తీసుకెళ్లాలి.
తాజావార్తలు
-
2027 World Cup: ప్రపంచ కప్‌లో ఆడే టాప్ 6 ఆటగాళ్లు వీరే.. ఆకాశ్ చోప్రా అంచనా ఇలా..
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?