Big Alert : ఇంటర్ సిలబస్‌లో కీలక మార్పులు.. కొత్త టెక్స్ట్ బుక్స్, QR కోడ్లతో డిజిటల్ లెర్నింగ్
- తెలంగాణ ఇంటర్ సిలబస్‌లో కీలక మార్పులు
- కొత్త టెక్స్ట్ బుక్స్, QR కోడ్లతో డిజిటల్ లెర్నింగ్
- సైన్స్ సబ్జెక్టుల్లో AI పాఠాలు, ఇంటర్నల్ మార్కులు
- ఆర్ట్స్, కామర్స్ విద్యార్థులకు కొత్త విధానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు విద్యాశాఖ కీలక అప్డేట్ అందించింది. మారుతున్న కాలానికి , జాతీయ విద్యా ప్రమాణాలకు అనుగుణంగా ఇంటర్మీడియట్ సిలబస్‌లో బోర్డు భారీ మార్పులు చేసింది. ఈ నూతన విద్యా సంవత్సరం నుంచే ఈ మారిన కొత్త సిలబస్ , సరికొత్త పాఠ్యపుస్తకాలు అమలులోకి రానున్నాయి. విద్యార్థులపై కేవలం రట్నాల చదువుల భారం తగ్గించి, వారిలో విశ్లేషణాత్మక నైపుణ్యాలను, సాంకేతిక అవగాహనను పెంచడమే లక్ష్యంగా ఈ మార్పులు చేశారు. కొత్త పుస్తకాలను ఆకర్షణీయమైన బహుళ రంగుల్లో (Multi-colour) ముద్రించడమే కాకుండా, డిజిటల్ కంటెంట్ కోసం క్యూఆర్ కోడ్లను (QR codes) కూడా అనుసంధానించారు. అన్నింటికంటే ముఖ్యంగా విద్యార్థులకు ఊరటనిస్తూ దాదాపు అన్ని సబ్జెక్టుల్లోనూ అంతర్గత మూల్యాంకనం (Internal Assessment) లేదా ప్రాక్టికల్స్ విధానాన్ని బోర్డు ప్రవేశపెట్టింది.
భాషా సబ్జెక్టుల్లో స్థానిక సంస్కృతి, యాసకు పెద్దపీట
మొదటి, రెండు భాగాల్లోని (Part-I & II) సాధారణ, భాషా సబ్జెక్టుల విషయానికి వస్తే ఇంగ్లీష్ పుస్తకం ముఖచిత్రాన్ని సరికొత్తగా మార్చి, రంగుల డిజైన్‌తో రూపొందించారు. అలాగే తెలుగు, ఉర్దూ, సంస్కృతం, హిందీ, అరబిక్, ఫ్రెంచ్, మరాఠీ, కన్నడ సబ్జెక్టుల పాఠ్యపుస్తకాలను తెలంగాణ సంస్కృతి, యాస, స్థానిక సంప్రదాయాలకు అద్దం పట్టేలా మార్చారు. విద్యార్థులలో కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంచేందుకు వీలుగా వివిధ ప్రాజెక్ట్‌లు, కృత్యాలు (Activities) , ప్రయోగాలను చేర్చారు. అన్ని భాషా సబ్జెక్టులకూ ఈసారి 20 మార్కుల అంతర్గత మూల్యాంకనాన్ని ప్రవేశపెట్టడం విశేషం. ఇతర బోర్డుల నుంచి చూస్తే ఫ్రెంచ్ పుస్తకాన్ని సీఈసీఆర్ఎల్ (CECRL) నుండి, మరాఠీని మహారాష్ట్ర బోర్డు నుండి , కన్నడను కర్ణాటక బోర్డు నుండి స్వీకరించి ఇక్కడి విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు.
Also Read
సైన్స్ సబ్జెక్టుల్లో ‘ఏఐ’ పాఠాలు.. ఎన్సీఈఆర్టీకి అనుగుణంగా మార్పులు
పార్ట్-3 లోని సైన్స్ సబ్జెక్టుల్లో జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా సిలబస్‌ను ఎన్సీఈఆర్టీ (NCERT) ప్రమాణాలకు అనుగుణంగా మార్చారు. గణితం (Maths 1A & 1B) పుస్తకాల్లో భారతీయ గణిత శాస్త్రజ్ఞుల పరిచయంతో పాటు ఆసక్తికరమైన గణిత విషయాల కోసం ప్రత్యేక బాక్సులను చేర్చారు. మ్యాథ్స్-1A లో ‘సెట్స్ అండ్ రిలేషన్స్’, ‘సీక్వెన్సెస్ అండ్ సిరీస్’ అనే రెండు కీలక అధ్యాయాలను కొత్తగా చేర్చి, పునరావృతమయ్యే పాత లెక్కలను తొలగించి పేజీల సంఖ్యను తగ్గించారు. భౌతిక శాస్త్రం (Physics) లో కాన్సెప్ట్ మ్యాప్‌లు, ఐసీటీ కార్నర్ తీసుకురావడంతో పాటు సరికొత్త సాంకేతికతపై అవగాహన కోసం “AI – Physics of Emerging Technologies” (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, స్పేస్ సైన్స్) అనే అత్యంత ఆధునిక పాఠాన్ని చేర్చారు. ఫిజిక్స్‌లో 20 మార్కుల ఇంటర్నల్స్ ప్రవేశపెట్టడంతో పాటు, మొదటి సంవత్సరంలోనే 15 మార్కులకు ప్రాక్టికల్ పరీక్షలను తెచ్చి ప్రయోగాలను కేవలం 10 కి పరిమితం చేశారు. రసాయన శాస్త్రం (Chemistry) లో మైండ్ మ్యాప్‌లను జోడించి, ఫస్టియర్‌లోనే 15 మార్కుల ప్రాక్టికల్స్, 15 మార్కుల అంతర్గత మూల్యాంకనాన్ని తెచ్చారు. బోటనీ, జువాలజీ సిలబస్‌లను కూడా ఎన్సీఈఆర్టీకి మార్చారు. బోటనీలో భారతీయ శాస్త్రవేత్తల ఫోటోలు, గ్లోసరీ చేర్చగా, జువాలజీలో ‘ఎకనామిక్ జువాలజీ’ అనే కొత్త అధ్యాయాన్ని తెచ్చి, బయోడైవర్సిటీ, ఎకాలజీ యూనిట్లను విలీనం చేసి 15 మార్కుల ఇంటర్నల్స్ కేటాయించారు.
హ్యుమానిటీస్ (ఆర్ట్స్) లో విశ్లేషణాత్మక విధానం.. కెరీర్ గైడెన్స్
ఆర్ట్స్ విద్యార్థులకు విమర్శనాత్మక ఆలోచనను (Critical thinking) పెంపొందించేలా హ్యుమానిటీస్ సబ్జెక్టులను రీడిజైన్ చేశారు. ఎకనామిక్స్ సబ్జెక్టును మల్టీకలర్ డిజైన్‌తో మార్చి, 20 మార్కుల ఇంటర్నల్స్ కేటాయించారు. హిస్టరీ పాఠాలను కేవలం బట్టీ పట్టేలా కాకుండా పరిశోధనాత్మక విధానంలో మ్యాప్‌లు, టైమ్లైన్లు, చిత్రాలు , ప్రాజెక్ట్ పనులతో విశ్లేషణాత్మకంగా రూపొందిస్తూ 20 మార్కుల అంతర్గత మూల్యాంకనాన్ని తెచ్చారు. పొలిటికల్ సైన్స్ సిలబస్‌ను ఎన్సీఈఆర్టీకి అనుగుణంగా మార్చి, అప్లికేషన్ ఓరియెంటెడ్ వివరణలు, రాజకీయ ప్రముఖుల గురించిన ఆసక్తికర నిజాలతో కూడిన బాక్సులను జోడించి 20 మార్కుల ఇంటర్నల్స్ ఇచ్చారు. కామర్స్ అండ్ అకౌంటెన్సీ విషయానికి వస్తే పుస్తకం ప్రారంభంలోనే విద్యార్థులకు ఉండే కెరీర్ అవకాశాలను స్పష్టంగా వివరించారు. కామర్స్, అకౌంటెన్సీ రెండింటిలోనూ విడివిడిగా 10 మార్కుల చొప్పున (మొత్తం 20 మార్కులు) కృత్యాల ఆధారిత అంతర్గత మూల్యాంకనాన్ని ప్రవేశపెట్టారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లోనూ 20 మార్కుల ఇంటర్నల్స్ తెచ్చారు. జియోగ్రఫీ (భూగోళశాస్త్రం) సిలబస్‌ను 6 యూనిట్లు, 18 అధ్యాయాలకు కుదించి, “Do You Know?” బాక్సులతో పాటు 20 మార్కుల అంతర్గత మూల్యాంకనాన్ని చేర్చారు. మొత్తం మీద ఈ నూతన సిలబస్ మార్పులు ఇంటర్ విద్యార్థులను జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధం చేయడంలో , వారి ప్రాక్టికల్ నాలెడ్జ్‌ను పెంచడంలో ఎంతగానో తోడ్పడనున్నాయి.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!