తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభవార్త. విద్యార్థుల మొబైల్‌లకే ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ హాల్‌టికెట్లు రానున్నాయి. విద్యార్థులు ఇచ్చిన మొబైల్ ఫోన్ నంబర్లకు ఇంటర్ బోర్డు అధికారులు లింక్ పంపిస్తున్నారు. ఆ లింక్ క్లిక్ చేస్తే హాల్‌టికెట్ వస్తుందని, డౌన్‌లోడ్ చేసుకోవచ్చని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. గతంలో కళాశాలలకే హాల్‌టికెట్లను పంపేవారు. విద్యార్థులు తమ తమ కళాశాలలకు వెళ్లి హాల్‌టికెట్లను తీసుకునేవారు. నేటి (జనవరి 30) నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర విద్యార్థులకు ఇంటర్నల్ పరీక్షలు జరగనున్నాయి.…
ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులను పాస్ చేస్తున్నట్లు ప్రకటించిన తెలంగాణ ఇంటర్ బోర్డు మరో గుడ్‌న్యూస్ అందించింది. రీవాల్యూయేషన్, రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసిన వారు.. తమ దరఖాస్తును శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి రద్దు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు రీ వాల్యూయేషన్, రీ కౌంటింగ్ కోసం విద్యార్థులు చెల్లించిన ఫీజును తిరిగి పొందవచ్చని ఇంటర్ బోర్డు పేర్కొంది. ఫిబ్రవరి 1 నుంచి కాలేజీలలోని ప్రిన్సిపాళ్ల ద్వారా నగదును తీసుకోవచ్చని సూచించింది.…