అంబులెన్స్ నిలిపివేత పై హైకోర్టులో విచారణ… ఎలా అడ్డుకుంటారు…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google

ఏపీ తెలంగాణ బోర్డర్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. లాక్డౌన్ కారణంగా ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్ లను తెలంగాణ బోర్డర్‌లోనే అధికారులు అడ్డుకుంటున్నారు. దీంతో అత్యవసర చికిత్స అందక రోగులు మృతిచెందుతున్నారు. ఇలా బోర్డర్లో అంబులెన్స్ లను అడ్డుకోవడంపై ఏపీ ప్రభుత్వం మండిపడింది. ఇక, తెలంగాణ బోర్డర్లో అంబులెన్స్ లను అడ్డుకోవడంపై హైకోర్టులో విచారణ జరుగుతున్నది. ఈ విచారణలో ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్ దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వం తరపుప అడ్వకేట్ జనరల్ శ్రీరాం వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం అభ్యంతరాలపై హైకోర్టు సానుకూలతను వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలపై హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. తెలంగాణ ఇచ్చిన మార్గదర్శకాలకు చట్టబద్దత ఎక్కడ ఉందని అన్నారు. రాజ్యాంగం కంటే మార్గదర్శకాలు గోప్పి కాదని, రైట్ టు లైఫ్ ను ఆపడానికి మీకు ఏం అధికారం ఉంది అని ప్రశ్నించింది హైకోర్టు. ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి నిబంధనలు తాము చూడలేదని హైకోర్టు పేర్కోన్నది. రాజ్యాంగాన్ని మీరు మార్చలేరని, నేషనల్ హైవే యాక్ట్ ను ఉల్లంఘించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అనుమతి లేదని, కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ విధంగా అంబులెన్స్ లను ఆపడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా అనుమతి తీసుకున్నారా అని ప్రశ్నించింది.
Also Read
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- DGP CV Anand: "ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్".. వాళ్లను అస్సలు వదలమన్న డీజీపీ సీవీ ఆనంద్
- Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్‌ను ముంచేసిన భారీ వర్షం
- Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
తాజావార్తలు
-
Vadde Naveen : బాహుబలి కంటే పుష్పనే స్పెషల్… స్టార్స్ సినిమాలపై వడ్డే నవీన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
YS Jagan: డీఎస్సీలో భారీ అక్రమాలు.. ఫస్ట్ ర్యాంకర్‌కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు!
-
TATA Sierra EV: టాటా సియెర్రా ఈవీ రిలీజ్ కు రెడీ..! 500KM రేంజ్, ప్రీమియం ఫీచర్లు
-
Wedding Card Vastu Tips: పెళ్లిళ్ల సీజన్ వచ్చేస్తోంది.. వాస్తు ప్రకారం మీ వెడ్డింగ్ కార్డ్ ఇలా ఉంటేనే శుభప్రదం! ఈ తప్పులు అస్సలు చేయకండి!
-
Aus vs Ban: ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ.. బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి పరుగుల ఖాతా తెరవకముందే మూడు వికెట్లు డౌన్.!
ట్రెండింగ్
-
Fact Check: హీరోయిన్‌తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..