Telangana High Court : తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం త్రిపుర హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్‌ను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేశారు. కొలిజియం చేసిన సిఫార్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించడంతో ఈ బదిలీ అమలులోకి వచ్చింది. జూలై 14, 2025న విడుదల చేసిన కేంద్ర నోటిఫికేషన్ ప్రకారం నాలుగు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల బదిలీలు జరగనున్నాయి.
Ravindra Jadeja: ఎంతకు తెగించార్రా.. గెలుపు కోసం మరీ ఇంతకు దిగజారాలా..? వీడియో వైరల్
అందులో భాగంగా త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్‌ను తెలంగాణ హైకోర్టుకు నియమించారు. జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్‌కు ఇది ఒక కీలక బాధ్యత. 2023 ఏప్రిల్ 11న ఆయన త్రిపుర హైకోర్టు సీఎంజేగా నియమితులయ్యారు. ఆయనకు పుట్టిన కోర్టుగా జార్ఖండ్ హైకోర్టు గుర్తింపు ఉంది. న్యాయ రంగంలో ఆయనకు ఉన్న అనుభవం, తీర్పుల్లో ఆయన చూపిన నిష్పక్షపాతత, న్యాయశాస్త్రంపై గల లోతైన అవగాహన తెలంగాణ న్యాయవ్యవస్థకు తోడ్పాటును అందించనుందని న్యాయవర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.
MLA Koneti Adimulam: తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన టీడీపీ ఎమ్మెల్యే..! మీ పెత్తనం ఏంటి..?