కరోనా సెకండ్ వేవ్ కేసులు భారీ సంఖ్యలో వెలుగుచూస్తోన్న తరుణంలో.. ఇప్పుడు బ్లాక్ ఫంగస్ కేసులు కొత్త టెన్షన్ పెడుతున్నాయి.. దేశ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈ కేసులు నమోదు కాగా.. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో పలు కేసులు వెలుగుచూశాయి.. తాజాగా ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలోనూ ఓ కేసు బయటపడింది. అయితే, బ్లాక్ ఫంగస్ కేసుల విషయంలో కీలక సూచనలు చేశారు తెలంగాణ డీఎంఈ.. తెలంగాణ హెల్త్ డైరెక్టర్… ముఖ్యంగా కోవిడ్ నుంచి కోలుకున్న కొన్ని కేసుల్లో బ్లాక్ ఫంగస్ సమస్య వస్తుందని తెలిపారు డీఎంఈ.. బ్లాక్ ఫంగస్ భారిన పడితున్నవారిలో ఎక్కువగా ఈఎన్‌టీ సమస్యలు ఎదుర్కొంటున్నారని.. దీంతో.. బ్లాక్ ఫంగస్ కేసుల చికిత్సకు సర్కార్ నోడల్ కేంద్రం ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఈఎన్టీ ఆసుపత్రిని నోడల్ కేంద్రంగా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.. బ్లాక్ ఫంగస్ భారిన పడి, కోవిడ్ పాజిటివ్ గా ఉన్న వారికి గాంధీతో చికిత్స అందించనున్నారు.
కోవిడ్ బారినపడిన కొందరిలో బ్లాక్ ఫంగస్ సమస్యను గుర్తించినట్టు ప్రకటించారు డీహెచ్ శ్రీనివాస రావు… కోవిడ్ రోగులకు చికిత్స అందించే సమయంలో షుగర్ లెవల్ ని సరిగా అదుపు చేయాలని ఆస్పత్రులు, వైద్యులకు కీలక సూచనలు చేసిన ఆయన… కోవిడ్ సమయంలో బ్లాక్ ఫంగస్ రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రైవేట్ ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేశారు. షుగర్ లెవల్స్‌ని కంట్రోల్ చేసేందుకే అవసరం అయితే స్టిరాయిడ్‌లను వాడాలని సూచించారు.. అవసరం అయితే యాంటి ఫంగల్, యాంటీ బయోటిక్ మందులు వాడాలని ఆదేశాలిచ్చారు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు.